Republic Day

ఢిల్లీ గణతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పందించిన డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా.. 6 అంచెల సెక్యూరిటీ చెకింగ్స్ ఏర్పాటు చేశామని, ముఖ్యమైన ప్రదేశాలలో వీడియో కెమెరాలు, వీడియో అనలిటిక్స్, ఎఫ్ఆర్ఎస్మ ల్టీలేయర్ బారికేడింగ్ సిస్టమ్ ను సిద్ధంగా ఉంచామన్నారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరిస్తారని చెప్పారు.

భారీ బందోబస్తు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా చెప్పారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఢిల్లీలో వేలాది సీసీటీవీలు, కెమెరాలు ఇన్ స్టాల్ చేశామన్నారు. వీటిల్లో కొన్ని కెమెరాల్లో వీడియో అనలిటిక్ ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. నేరస్థులు, వాంటెడ్ టెర్రరిస్టుల డేటాబేస్ ను సులభంగా గుర్తించేలా సీసీటీవీలో వివరాలను పొందుపర్చామని, వారికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్‌లు, పోలీసు సిబ్బందికి హెచ్చరికలు అందుతాయని డీసీపీ తెలిపారు. దాంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడుఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ కి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరుకానున్నారు. ఆయన జనవరి 23 నుండి జనవరి 26 వరకు భారతదేశంలోనే ఉంటారు. ఆయన పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌, ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖర్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, దేశాధ్యక్షుడు ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

Related Posts
సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
Sankranti holidays announced by Inter Board

హైరదాబాద్‌: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈమేరకు జనవరి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి మొత్తంగా ఇంటర్ కాలేజీలకు Read more

మందిరం-మసీదు వివాదం: యోగి ఆదిత్యనాథ్
మందిరం-మసీదు వివాదం: యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధర్మ సంసద్ కార్యక్రమంలో పాల్గొనగా, మహాకుంభ మేళా జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అన్న వాదనలను ఖండించారు. దేశంలో అనేక మందిరం-మసీదు Read more

అమెరికా పర్యటనకు వెళ్తున్న మంత్రి లోకేష్ ..షెడ్యూల్ ఇదే
lokesh us

నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యం. ఈ సందర్శనలో, Read more

హత్య కేసు ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా
హత్య కేసు ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. కాగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *