అయోధ్య… శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అనుమానాస్పద మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో రామాలయ భద్రత గురించి ట్రస్ట్‌కు హెచ్చరిక కనిపించింది.. ఆ మెయిల్ పై ట్రస్ట్ దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా సంస్థలు, జిల్లా పోలీసు పరిపాలన బృందం కూడా అప్రమత్తమయ్యాయి.. మెయిల్ ఎక్కడ్నుంచి వచ్చింది. ఎవరు పంపించారు అనే విషయాలపై విస్తృత తనిఖీ చేస్తున్నారు.

రంగంలోకి పోలీసులు
అయోధ్య రామ మందిర ట్రస్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విషయంపై పోలీసులు, నిఘా విభాగం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు సమాచారం. అయితే, అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు 2024 సెప్టెంబర్‌లో కూడా రామాలయంపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు వచ్చింది.
ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు
ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామాలయం చుట్టూ, దాని చుట్టుపక్కల ప్రాంతంలో అభేద్యమైన భద్రతా వ్యవస్థ ఉంది. ఇది మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం ఎంట్రీ డ్రోన్ వ్యవస్థతో అమర్చబడింది. మరోవైపు, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సమాచారం ఇస్తూ, రామమందిర భద్రత కోసం దాదాపు 4 కిలోమీటర్ల భద్రతా గోడ నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ గోడ 18 నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు.. ఈ గోడను ఇంజనీర్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తుంది.
Read Also: Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?