ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశముంది: జూపల్లి కృష్ణారావు

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశముంది: జూపల్లి కృష్ణారావు

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ మరికొన్ని గంటల్లో లభించే అవకాశముందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌ను కట్ చేస్తున్నామని తెలిపారు. మనుషుల ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ, 5.8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి ఆనవాళ్లు స్కానింగ్‌లో కనిపించాయని అన్నారు.

Advertisements
 ఎస్ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన వారి ఆచూకీ  లభించే అవకాశముంది:  జూపల్లి కృష్ణారావు

టన్నెల్ మరో నలుగురు

మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లుగా తెలుస్తోందని వెల్లడించారు. సహాయక చర్యల్లో మొత్తం 11 విభాగాల వాళ్లు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. పనులు వేగంగా జరగడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ ఎస్ఎల్‌బీసీ సొరంగంలో లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వాళ్లకు తెలియదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 200 కిలోమీటర్ల సొరంగం తవ్వినట్లు హరీశ్ రావు చెబుతున్నారని, మరి గత పదేళ్లలో ఎస్ఎల్‌బీసీలో 20 కిలోమీటర్లు కూడా ఎందుకు తవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో దీనిని పూర్తి చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించారు.

Related Posts
ఆ భూములను వెనక్కి తీసుకుంటాం – పొంగులేటి
Special App for Indiramma Houses . Minister Ponguleti

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైన కొత్త ROR చట్టాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
Minister Uttam Kumar warning to party MLAs and MLCs

ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ Read more

ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు

అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన హైదరాబాద్‌: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ Read more

Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్
Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ముగింపు – మూల్యాంకనం ప్రారంభం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు గురువారం (మార్చి 20)తో Read more

Advertisements
×