ముదురుతున్న చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం..అంతా టెన్షన్!

Trump Tariffs: ముదురుతున్న చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం..అంతా టెన్షన్!

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమై.. ప్రచ్ఛన్న యుద్దంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతోంది. ఇరుదేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్.. చైనా మినహా మిగతా అన్ని దేశాలపై టారీఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. చైనాపై మరిన్ని సుంకాలు విధించిన ఆయన.. మొత్తం 125 శాతానికి పెంచారు. అమెరికాకు చైనా దిగుమతులపై టారీఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అయితే, కేవలం చైనానే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశారు? చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధానికి కారణాలు ఏంటి? ఇరు దేశాల మధ్య ఎగుమతుల్లో అంతరం, వాణిజ్య లోటే కారణమా? అనే చర్చ జరుగుతోంది.

Advertisements
ముదురుతున్న చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం..అంతా టెన్షన్!

ప్రపంచ ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం అమెరికాదే
దాదాపు 3.42 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా చైనా నిలిచింది. ఇందులో ఎక్కువ మొత్తంలో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా విషయానికి వస్తే 2024 ఆర్దిక సంవత్సరంలో దాని ఎగుమతుల విలువ సుమారు $1.71 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం అమెరికాదే.
ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు
2024లో చైనా, అమెరికా వాణిజ్యం విలువ సుమారు 582.4 బిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా. 2024లో చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతులు 143.5 బిలియన్ల డాలర్లు.. చైనా నుంచి దిగుమతులు మొత్తం 438.9 బిలియన్ డాలర్లు. అంటే, చైనాతో పోల్చితే వాణిజ్య లోటు 295.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూడ్చుకోడానికే పారిశ్రామిక, వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చైనాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజా సుంకాలు విధించారు.

READ ALSO: Trump Tariffs: అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్

Related Posts
గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more

‘కహ్వా మ్యాన్’ నుంచి సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ప్రయాణం
'కహ్వా మ్యాన్' నుంచి సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ప్రయాణం

జర్నలిస్టులకు సుపరిచితమైన 'కహ్వా మ్యాన్' 2015-2020 మధ్యకాలంలో, నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ (MHA)లో అదనపు కార్యదర్శిగా ఉన్నప్పుడు, జ్ఞానేష్ కుమార్ తన సహజమైన ఆతిథ్యంతో Read more

Nidhi Tiwari: మోదీ ప్రైవేట్ సెక్రటరీ హోదాకు ఎదిగిన నిధి తివారీ
మోదీ ప్రైవేట్ సెక్రటరీ హోదాకు ఎదిగిన నిధి తివారీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ Read more

త్వరలో మార్కెట్ లోకి గుండెపోటు నివారణ వ్యాక్సిన్
త్వరలో మార్కెట్ లోకి గుండెపోటు నివారణ వ్యాక్సిన్

గుండెపోటు (హార్ట్ అటాక్) చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ కబళిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలి మరణించడం, చిన్నారులకే గుండెపోటులు రావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×