అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27)‌, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.

Advertisements
అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

ఇంటికి సమీపంలోని బీచ్‌

ఇదిలా ఉంటే ప్రవీణ్‌ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మరణించారు. ప్రవీణ్‌ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌ మృతితో కేశంపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Posts
Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?
Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?

బ్రిడ్జి ప్రారంభోత్సవంలో వివాదం అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఇటీవల ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఊహించని సంఘటన Read more

Viral : ఒకే ఫ్రేమ్ లో మోడీ , పవన్ , బాబు
pawan modi babu

మరోసారి ముగ్గురు అగ్ర నేతలు కలువడం..ఒకే ఫ్రేమ్ లో ఉండడం అభిమానుల్లో , పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోడీ Read more

తెలంగాణ అసెంబ్లీకి ఆటోలు నడిపిన బీఆర్‌ఎస్ నేతలు ఆటో డ్రైవర్‌లకు సహాయం చేయాలని డిమాండ్
తెలంగాణ అసెంబ్లీకి ఆటోలు నడిపిన బీఆర్‌ఎస్ నేతలు ఆటో డ్రైవర్‌లకు సహాయం చేయాలని డిమాండ్

కేటీఆర్ నేతృత్వంలో నాయకులు, ఆటో రిక్షాలను నడుపుతూ తెలంగాణ శాసనసభకు వెళ్లారు. ఆటో డ్రైవర్‌ల కోసం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై ఈ నిరసన చేపట్టారు. కేటీఆర్‌తో Read more

రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?
రేఖ గుప్తా ఆస్తుల విలువ మీకు తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా కానున్నారు. ఈ గురువారం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ Read more

Advertisements
×