Wanaparthy Rice Mill Scam: తెలంగాణలో రైస్ మిల్లర్ల అవకతవకలు రోజుకొకటి చొప్పున బయటపడుతూనే ఉన్నాయి. అక్రమ మార్గాల్లో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తూ కోట్లకు పడగలెత్తిన కొందరు మిల్లర్లకు అధికారులు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ ప్రముఖ రైస్ మిల్లు అక్రమాలు, లీలలు అధికారుల ఆకస్మిక తనిఖీల్లో నిలువునా బట్టబయలయ్యాయి.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మీరాసిపల్లి (మీరాస్పల్లి) గ్రామంలోని శ్రీ సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో మంగళవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం, హైదరాబాద్ అధికారులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Read also: Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
25 వేలకు పైగా ధాన్యం బస్తాల మాయం!
ఈ తనిఖీల సందర్భంగా మిల్లు రికార్డులను, నిల్వలను పరిశీలించిన అధికారులకు భారీ షాక్ తగిలింది. మిల్లులో ఉండాల్సిన 25,426 బస్తాల సీఎంఆర్ (Custom Milled Rice – కస్టమ్ మిల్ల్డ్ రైస్) ధాన్యం మాయమైనట్లు, దానిని పక్కదారి పట్టించినట్లు అధికారులు పక్కాగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో ఈ మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
వేరే మిల్లుకు ధాన్యం అప్పగింత.. యజమానిపై నివేదిక!
అక్రమాలు బయటపడటంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికక్కడే పంచనామా నిర్వహించారు. అనంతరం మిల్లులో మిగిలి ఉన్న మిగతా ధాన్యాన్ని భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా.. రాయినిపేటలోని ‘ఎంఎస్ ఏకేఆర్ ఇండస్ట్రీస్’ యాజమాన్యానికి తక్షణమే అప్పగించారు.

ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన పూర్తి నివేదికను, సదరు మిల్లు యజమానిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector) కు సమర్పించారు. ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు సంబంధిత మిల్లర్‌పై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Wanaparthy Rice Mill Scam: మిల్లర్లలో వణుకు.. తదుపరి టార్గెట్ ఏ మిల్లు?
ఈ మెరుపు దాడితో వనపర్తి జిల్లాలోని రైస్ మిల్లర్లలో ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ఇలాగే కొనసాగితే ఏ క్షణంలో ఏ మిల్లుపై దాడులు జరుగుతాయో, ఎవరి అక్రమాలు బయటపడతాయోనని కొందరు అక్రమార్క మిల్లర్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also: