Telangana Heavy Rains: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగం, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అనంతరం అది అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి.
Read Also : Bhu Bharathi : భూభారతి ద్వారా 9,200కు పైగా అక్రమ లావాదేవీలు – హరీష్ రావు

Telangana Heavy Rains: రాష్ట్రంలో 19 శాతం వర్షపాతం లోటు: హెచ్చరించిన అధికారులు
ఈ వర్షాకాల సీజన్‌లో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఓవరాల్‌గా 19 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 42 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హనుమకొండతో పాటు వరంగల్, జనగామ తదితర జిల్లాల్లో అత్యధికంగా వర్షపాత లోటు తీవ్రత ఉంది. వచ్చే ఐదు రోజుల పాటు రాబోయే వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, చెట్ల వద్ద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :