Telangana Farmers: ఆరుగాలం తోడు కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడం అన్నదాతకు ఓ సవాల్ గా మారింది. ఓ వైపు పగలంతా తీవ్రమైన ఎండలకు సాయంత్రం కాగానే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన గండం పొంచి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోతున్నారు. ఆకాశంలో చిన్న మేఘం కనిపించినా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చినుకు పడితే చాలు రైతులు వణికిపోతున్నారు. వరి కోసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి, ఆరబోసి తూర్పారబట్టి పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Cherlapalli Jail: చర్లపల్లి జైలును సందర్శించిన ట్రైనీ ఐపిఎస్ లు, డిఎస్పిలు

Telangana Farmers: దళారుల దోపిడీ – నిరీక్షణ తప్పని వైనం
అటు దళారులకు విక్రయించలేక ఇటు ధాన్యం రాశులకు నిత్యం కాపలా కాయలేకి పడరాని పాట్లు పడుతు న్నారు. రోజుకు మూడు, నాలుగుసార్లు ధాన్యం రాశులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల చుట్టూ తిరిగి వేసారి పోతున్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదోచోట వడగళ్ల కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొనుగోలు ప్రస్తుతం యాసంగి సీజన్ వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో 20 రోజులక్రితం కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కూడా తూకంకాకుండా నిలిచిపోయింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక రహదారులపై రైతులు ధాన్యం ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో రహదారులపై ఎక్కడ చూసినా వరి, మొక్కజొన్న ధాన్యం రాశులే కనిపిస్తుండడం గమనార్హం.
టార్పాలిన్ల కొరత, ప్రభుత్వ లక్ష్యం
అదే సమయంలో ఈ నెల 27 వరకు తెలంగాణకు ఆకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్షీట్లు అందుబాటులో లేకపోవడంతో చినుకుపడితే రైతుల్లో వణుకు మొదలవుతోంది, గతంలో వ్యవసాయశాఖ ద్వారా 50శాతం రాయితీపై రూ.1250కే టార్పాలిన్ షీట్ లభించేది. 2018 తర్వాత ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ షీట్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో రైతులు రూ.3వేలకు వెచ్చించి టార్పాలిన్లు కొనుగోలు చేయలేక దేవుడిపై భారం వేసి ధాన్యాన్ని ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో అకాల వర్షాల బారిన పడి ఆరబోసిన ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8221 కొనుగోలు కేంద్రాలను తెరిచింది. రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అధికారుల నిర్లక్ష్యం – దళారుల అదును
అయితే అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లను సత్వరమే వేగంగా చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నా క్షేత్రస్థాయిలో పౌరసరఫరాలశాఖతో పాటు ఇతర శాఖల అధికారుల్లో చలనం కనిపించడం లేదు. కొనుగోళ్ల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ముందుగా వరికోసిన రైతులు చేసేదేమీ లేక ధాన్యాన్ని దళారులకు విక్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా దళారులు క్వింటాల్ ధాన్యానికి రూ.1800కు మించి ధర పెట్టడం లేదని, వారం రోజుల తర్వాత ధాన్యం కొనుగోళ్ల తాలూ కు డబ్బులు ఇస్తున్నారన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: