Sangareddy news: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న శివంపేటరూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం: కాంగ్రెస్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చేలా ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ మంగళవారం ప్రారంభించారు.


టెంకాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన స్థానిక ప్రజలతో కలిసి పనుల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నత్తి దశరథ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సీసీ రోడ్లు, మరుగు కాల్వల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జీఎస్) కింద నిధులు మంజూరు చేయించి గ్రామాల్లో అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నట్లు వెల్లడించారు.
Sangareddy news: ఆదర్శ గ్రామంగా శివంపేట
శివంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లికార్జున్, ఉప సర్పంచ్ బింటు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, వివిధ గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: