CM Revanth Reddy : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఉపాధ్యాయులు ప్రార్థిస్తున్న న్యాయమైన కోరికలను తీరుస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
Read Also: Telangana : రేవంత్ రెడ్డికి అసలు పరీక్ష ముందుందా ?

CM Revanth Reddy : ఉపాధ్యాయుల సంక్షేమం మరియు ప్రభుత్వ చర్యలు
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని, 315 జీవో ద్వారా ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, పిఆర్సీ (PRC) సమస్యలకు పరిపరి విధాలా పరిష్కారాలు వెతికాని తెలిపారు. స్వల్ప కాలంలోనే దాదాపు రూ.6,000 కోట్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను ఉద్యోగులకు అందించినట్లు వెల్లడించారు.అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యా విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయడం లేదని, ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసే వారి మాటలను నమ్మవద్దని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :