Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణ లో మళ్లీ వర్షాలు

Follow Us: Google News Daily Hunt
telangana rain alert heavy rains yellow alert
telangana rain alert heavy rains yellow alert
FONT SIZE
GET APP

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీల మధ్య దక్షిణాది అంతటా ఈశాన్య రుతుపవనాలు (Northeast Monsoon) వేగంగా విస్తరించే అవకాశముందని వాతావరణ నిపుణులు (Weatherman) వెల్లడించారు. దీని ప్రభావంతో అక్టోబర్ 15 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాలు లేకపోయినప్పటికీ, అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే నమోదవుతాయని అధికారులు తెలిపారు.

Read Also: ఢిల్లీలో మళ్లీ భవనం కూలిన ఘటన.. గర్భిణి సహా ముగ్గురు మృతి

మరోవైపు, బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా (Depression) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే హెచ్చరించింది. ఒకవేళ ఇది వాయుగుండంగా మారితే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జోరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు