KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని, ఆయన సమర్థవంతమైన పాలనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగా ప్రశంసించారు. రాష్ట్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ చంద్రబాబు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఏపీలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన కొనియాడారు.

ఏపీలో క్రాఫ్ హాలిడే, కరువు లేదు: కేటీఆర్
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లోటు వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పటికీ, అక్కడి ప్రభుత్వం సకాలంలో నీటిని ఎత్తిపోసుకునే ఏర్పాట్లు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ సమర్థమైన నిర్వహణ వల్లే ఏపీలో క్రాఫ్ హాలిడే గానీ, కరువు పరిస్థితులు గానీ తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు.
Read also: Mahesh kumar Goud: కొండా సురేఖపై మహేశ్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
KTR: తెలంగాణలో కరువుకు రేవంత్ రెడ్డే కారణం: కేటీఆర్ విమర్శలు
పక్క రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉంటే, ఒక్క తెలంగాణలో మాత్రమే కరువు ఛాయలు అలుముకున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ దుస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
హైదరాబాద్‌లో మొదలైన నీటి కష్టాలు
ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణపాల వల్ల భాగ్యనగరంలోనూ నీటి కష్టాలు మొదటమయ్యాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పవని, ఇప్పటికే ఇళ్లకు నీటి సరఫరాపై నోటీసులు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: