Holidays : వరుస సెలవులు.. రద్దీగా మారిన హైవేలు

Follow Us: Google News Daily Hunt
Traffic Restrictions For Ganesh Immersion
Traffic Restrictions For Ganesh Immersion
FONT SIZE
GET APP

Holidays : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భాగ్యనగరం ఖాళీ అవుతోంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రజలు తమ సొంత ఊళ్లకు పయనం కావడంతో నగరంలోని ప్రధాన మార్గాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS) తో పాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ముందస్తు రిజర్వేషన్లు పూర్తవ్వడంతో పాటు సాధారణ ప్రాంగణాలు కూడా జనసందోహంతో నిండిపోయాయి. సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడటంతో చాలామంది ప్రయాణికులు సొంత వాహనాలు, క్యాబ్‌లు మరియు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణాలు సాగిస్తున్నారు.

Read Also : పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణ పై మంత్రి వివేక్ క్లారిటీ

హైవేలపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ

సొంత వాహనాల్లో స్వగ్రామాలకు బయలుదేరిన వారి సంఖ్య పెరగడంతో ప్రధాన జాతీయ రహదారులపై రాత్రి నుంచి రద్దీ తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ (NH-65), హైదరాబాద్ – కర్నూలు (NH-44) నేషనల్ హైవేలపై వాహనాలు బారులు తీరాయి. పంథంగి, కొర్లపహాడ్, షాద్‌నగర్ వంటి ప్రధాన టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు వేచి చూడాల్సి వస్తోంది. టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, ఒకేసారి వేలాది వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. పోలీసులు, టోల్ ప్లాజా నిర్వహకులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు