TGSRTC Strike Updates: ఆర్టీసీ కార్మికులు తొందరపడవద్దు.. ప్రభుత్వం చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us: Google News Daily Hunt
TGSRTC Strike Updates
TGSRTC Strike Updates
FONT SIZE
GET APP

TGSRTC Strike Updates: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్మికులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Read Also: Telangana Cabinet: మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలపై ఉత్కంఠ

TGSRTC Strike Updates: కేబినెట్ చర్చల ముఖ్యాంశాలు

రేపు (శుక్రవారం) డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.కార్మికులు ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, మీ కుటుంబాలకు మీ అండ అవసరమని మంత్రి శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

CM Revanth Reddy on RTC Strike
CM Revanth Reddy on RTC Strike

ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగాలు పోతాయనే ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సబ్ కమిటీని కూడా వేసిందని గుర్తుచేశారు.బయటి శక్తుల ప్రేరేపిత చర్యలకు లోనై అనర్థాలు కొని తెచ్చుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో చర్చలకు రావాలని మంత్రులు కోరారు.ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూల దృక్పథంతో ఉందని, రేపటి చర్చలతో ఈ సమ్మెకు శుభం కార్డు పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు