Bellampalli Development:బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సింగరేణి సంస్థ సహకారం కోరుతూ బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న సింగరేణి ప్రహరీ గోడను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని జీఎంను కోరారు. అలాగే పట్టణంలోని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మరియు చిన్నారులు సాయంత్రం వేళ వినోదంగా గడిపేందుకు ఏఎంసీ ఏరియాలో ఉన్న సింగరేణి పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు.
Read also: Heavy Rain In Hyd : నిన్నటి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన నగరవాసులు
Bellampalli Development:పార్కులు క్రీడా ప్రాంగణాల ఆధునీకరణ
ఇదే సందర్భంగా సింగరేణి ఫంక్షన్ హాల్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తే ప్రజలకు, సంస్థకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పట్టణానికి చెందిన క్రీడాకారుల ప్రతిభకు వేదికైన తిలక్ స్టేడియంను పునరుద్ధరించి, పార్కులో చిన్నారుల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు ఇండోర్ గేమ్స్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. అదనంగా పట్టణంలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేందుకు సింగరేణి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సంవత్సరాలుగా నివసిస్తున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతున్న సమయంలో సింగరేణి అధికారులు స్థల సమస్యలతో అడ్డుపడుతున్నారని, వారికి సహకరించి ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని జీఎంను కోరారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: