Open AI Warning: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత మరింత పరిణతి చెందుతున్న కొద్దీ దాని నియంత్రణ సవాలుగా మారుతోంది. తమ అంతర్గత ఏఐ ఏజెంట్లు పరిమితులు దాటి చేసిన అనధికారిక కార్యకలాపాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా సంస్థలకు సమాచారం అందించినట్లు చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ అధికారికంగా వెల్లడించింది. హద్దులు దాటి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఏఐ మోడళ్ల తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ ప్రకటన అందరికి షాక్‌కు గురిచేసింది.
Read Also: Justice Ujjal Bhuyan: ఓటు హక్కు తొలగించడం రాజ్యాంగ విరుద్ధమే: జస్టిస్ భుయాన్
హ్యాకింగ్ ఘటనతో వెలుగులోకి..
ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ‘హగ్గింగ్ ఫేస్’ (Hugging Face)లో ఇటీవల అనుకోకుండా జరిగిన భద్రతా ల్యాప్స్ తర్వాత సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అప్రమత్తమైంది. తమ ఏఐ ఏజెంట్లు ఏ స్థాయి వరకు పరిమితులు దాటాయో తెలుసుకునేందుకు కంపెనీ విస్తృతస్థాయి అంతర్గత సమీక్షను ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపు 50 పెటాబైట్ల బృహత్తర డేటాను కంపెనీ ఆడిట్ చేస్తోంది.

హద్దులు దాటిన ఆటోమేటెడ్ ఏజెంట్లు
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస సెక్యూరిటీ ఉల్లంఘనలు ఏఐ రంగానికి సవాలుగా మారాయి. మరింత శక్తివంతమైన ఏఐమోడళ్లను నియంత్రించడంపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై ఓసెన్ ఏఐ స్పందిస్తూ.. “కొన్ని సందర్భాల్లో ఏఐ మోడళ్లు ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిర్దేశిత పరిమితులకు భిన్నంగా, అనూహ్య రీతిలో ఉపయోగించాయి. గతంలో వీటిపై సరైన సాంకేతిక నిబంధనలు లేదా పరిమితులు వర్తింపజేయలేకపోయామని గ్రహించాం. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు, అలాగే ప్రారంభంలోనే గుర్తించేందుకు కొత్త సాంకేతిక, కార్యాచరణ రక్షణ చర్యలను అమలు చేస్తున్నాం” అని తెలిపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also