iPhone 18 Pro Max Price Hike: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలపై టెక్ మార్కెట్లో అంచనాలు జోరందుకున్నాయి. ఈసారి యాపిల్ నుంచి వస్తున్న ఈ అత్యున్నత టాప్ మోడల్ ధర భారత్‌లో ఏకంగా రూ. 2 లక్షల మార్కును దాటేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
టెక్ నిపుణుల అంచనాల ప్రకారం, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 1.55 లక్షల నుంచి రూ. 1.60 లక్షల మధ్య ఉండవచ్చు. కానీ, హై-ఎండ్ స్టోరేజ్ వేరియంట్లు రూ. 2 లక్షలకు పైగా పలకనున్నాయి. గతేడాది మోడల్స్‌తో పోలిస్తే ధరలు రూ. 5,000 నుంచి రూ. 20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మెమరీ చిప్‌లు, విడిభాగాల ధరల పెరుగుదల, అత్యాధునిక 2nm చిప్ టెక్నాలజీ మరియు కెమెరా అప్‌గ్రేడ్‌ల వల్లే ఈ ధరల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
iPhone 18 Pro Max Price Hike: ఆపిల్ ఈవెంట్‌లో తొలి ఫోల్డబుల్ ఐఫోన్?
కేవలం ప్రో మోడల్సే కాకుండా, రాబోయే యాపిల్ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ‘ఐఫోన్ డ్యుయో’ అనే పేరు పెట్టవచ్చని టెక్ నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యాపిల్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :