ఈత అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి, సరదా అయితే ఈత వచ్చిన వారు, నేర్చుకునే వారు ప్రమాదాలు, వ్యాధులకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. గ్రామాల్లో కుంటలు, చెరువులు, బావులు పట్టణ ప్రాంతాల్లో ఈత కొలనులో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. ఈత కొలను నిర్వహణకు ప్రభుత్వం ప్రమాణాలను, నిబంధనలను నిర్దేశించింది.
నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలి
చాలా ప్రాంతాల్లో ఈత కొలనుల నిర్వహణలో పూర్తి స్థాయి నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈత కొలనుల పరిశుభ్రత, నీటి శుద్ధీకరణ, స్నానాల రూమ్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులు నిబంధనలు ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన శిక్షకులు లేకపోగా, స్విమ్మింగ్ వచ్చిన స్థానికులతోనే వెళ్లదీస్తున్నారు. పూల్స్ వద్ద ప్రత్యేకంగా లైవ్‌గార్డ్స్‌ను ఏర్పాటు చేయాలి.

ఇద్దరు లైవ్‌గార్డులు నిరంతర పర్యవేక్షణ
స్విమ్మింగ్ పూల్ లోతు ఒక వైపు 3 అడుగులు, మరో వైపు అత్యధికంగా 5.5 అడుగులు మాత్రమే ఉండాలి.
చర్మ సంబంధిత, ఇతర వ్యాధులకు అవకాశం లేకుండా ప్రమాణాల మేరకు స్విమ్మింగ్లోని నీటిని ఆధునిక పరికరాల సహాయంతో నిరంతరం శుద్ధి చేయాలి. చెత్తా చెదారం నిత్యం తొలగించి నీటిని పరిశుభ్రంగా ఉంచాలి. స్విమ్మింగ్ పూల్లో ప్రమాదాల బారిన పడకుండా నిబంధనలతో కూడిన బోర్డు, లేదా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి కనీస వయసు 8 సంవత్సరాలు ఉండాలి. 8 సంవత్సరాలలోపు వారికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రవేశం కల్పించరాదు.
జూనియర్ నేషనల్, సీనియర్ నేషనల్, స్కూల్ గేమ్స్ నేషనల్‌లో పాల్గొనడంతో పాటు, ఏడాది, లేదా ఆరు వారాల పాటు శిక్షణ పొంది డిప్లొమా ధ్రువపత్రం కలిగిన శిక్షకులు ఉండాలి. లైఫ్ జాకెట్లు ధరించిన ఇద్దరు లైవ్‌గార్డులు నిరంతర పర్యవేక్షణ చేయాలి.
Read Also: Ganta Srinivasa Rao : విశాఖ-విజయవాడ మధ్య నడిచే మార్నింగ్ ఫ్లయిట్స్ రద్దు