ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం

Swimming: ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం

ఈత అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి, సరదా అయితే ఈత వచ్చిన వారు, నేర్చుకునే వారు ప్రమాదాలు, వ్యాధులకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. గ్రామాల్లో కుంటలు, చెరువులు, బావులు పట్టణ ప్రాంతాల్లో ఈత కొలనులో స్విమ్మింగ్​ నేర్చుకునేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. ఈత కొలను నిర్వహణకు ప్రభుత్వం ప్రమాణాలను, నిబంధనలను నిర్దేశించింది.
నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలి
చాలా ప్రాంతాల్లో ఈత కొలనుల నిర్వహణలో పూర్తి స్థాయి నిబంధనలు పాటించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈత కొలనుల పరిశుభ్రత, నీటి శుద్ధీకరణ, స్నానాల రూమ్​ నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా నిబంధనల సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులు నిబంధనలు ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన శిక్షకులు లేకపోగా, స్విమ్మింగ్ వచ్చిన స్థానికులతోనే వెళ్లదీస్తున్నారు. పూల్స్ వద్ద ప్రత్యేకంగా లైవ్‌గార్డ్స్‌ను ఏర్పాటు చేయాలి.

Advertisements
ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం

ఇద్దరు లైవ్‌గార్డులు నిరంతర పర్యవేక్షణ
స్విమ్మింగ్ పూల్​ లోతు ఒక వైపు 3 అడుగులు, మరో వైపు అత్యధికంగా 5.5 అడుగులు మాత్రమే ఉండాలి.
చర్మ సంబంధిత, ఇతర వ్యాధులకు అవకాశం లేకుండా ప్రమాణాల మేరకు స్విమ్మింగ్​లోని నీటిని ఆధునిక పరికరాల సహాయంతో నిరంతరం శుద్ధి చేయాలి. చెత్తా చెదారం నిత్యం తొలగించి నీటిని పరిశుభ్రంగా ఉంచాలి. స్విమ్మింగ్ పూల్​లో ప్రమాదాల బారిన పడకుండా నిబంధనలతో కూడిన బోర్డు, లేదా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి కనీస వయసు 8 సంవత్సరాలు ఉండాలి. 8 సంవత్సరాలలోపు వారికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రవేశం కల్పించరాదు.
జూనియర్‌ నేషనల్, సీనియర్‌ నేషనల్, స్కూల్‌ గేమ్స్‌ నేషనల్‌లో పాల్గొనడంతో పాటు, ఏడాది, లేదా ఆరు వారాల పాటు శిక్షణ పొంది డిప్లొమా ధ్రువపత్రం కలిగిన శిక్షకులు ఉండాలి. లైఫ్‌ జాకెట్లు ధరించిన ఇద్దరు లైవ్‌గార్డులు నిరంతర పర్యవేక్షణ చేయాలి.

Read Also: Ganta Srinivasa Rao : విశాఖ-విజయవాడ మధ్య నడిచే మార్నింగ్ ఫ్లయిట్స్ రద్దు

Related Posts
KTR: కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు
Two cases registered against KTR

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ ఘటనపై ఎక్స్‌ పోస్టులు Read more

కేపీహెచ్‌బీలో ఘోర అగ్నిప్రమాదం
fire accident in kphb colony hyderabad

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి Read more

CM Revanth Reddy: బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమం : సీఎం రేవంత్‌ రెడ్డి
This program is to make the voice of BCs heard.. CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వేదికగా బీసీ సంఘాల ధర్నాలో పాల్గొన్నారు. ఈ Read more

మహా శివరాత్రి వేళ అధికారులకు పవన్ కీలక సూచనలు
కల కలం రేపుతున్న పవన్ కళ్యాణ్ పోస్ట్

అన్నమయ్య జిల్లా గుండాల కోన అటవీ ప్రాంతంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా శివాలయానికి వెళ్లిన భక్తులపై ఏనుగుల దాడి జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×