Telangana: కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని కేంద్రం జారీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2021లో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నారని ఏపీ పిటిషన్ వేసింది.

కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే
తెలంగాణ జారీ చేసిన 34ని జీవోను రద్దు చేయాలని ఏపీ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. తెలంగాణ, ఏపీ వేసిన పిటిషన్లను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం మంగళవారం విచారించింది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. స్టే ఇవ్వాలంటూ తెలంగాణ వేసిన రిట్ పిటిషన్లపై రెండువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసిన వారంలోగా రిజాయిండర్ ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది.