భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

Murder: భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

భర్త దాడి చేశాడు.. భార్య తల పోల్‌కు తగిలి గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే.. ఎక్కడైనా భర్త దాడిలో భార్య ప్రాణాలు కోల్పోతే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు.. కానీ ఇక్కడ మాత్రం స్టోరీ డిఫరెంట్. భర్తకు పడే శిక్ష తగ్గించి న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు, సహచరులు.. విశాఖలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆలోచింపజేస్తోంది. విశాఖలో ఇద్దరు డాన్సర్లు.. బంగారు రాజు, రమాదేవి..! ఇద్దరూ స్టేజ్ షోలు చేస్తుంటారు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు.. అన్యోన్య దాంపత్యం వారిది. వాళ్లకు ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. కానీ మనస్పర్ధలతో క్షణికావేశం ఆ దాంపత్య జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేషంలో భర్త దాడి చేయడంతో.. తల పక్కనే ఉన్న పోల్కు తగిలి భార్య ఆసుపత్రిపాలైంది. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

Advertisements
భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

కాస్త మనస్పర్ధలు వచ్చాయి
మాధవదారకు చెందిన అలమండ బంగార్రాజు, అల్లిపురానికి చెందిన రమాదేవి డాన్సర్లు. గత ఏడేళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. డ్యాన్సర్ వృత్తి వారి జీవనాధారం. ఇద్దరూ ప్రేమించుకొని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మాధవధారలో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు. అన్యోన్యంగా ఉండే జీవితంలో కాస్త మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో రమాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది. మార్చి 30 న బంగారు రాజు అక్కడికి వెళ్లి తనతో పాటు రమ్మన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రమాదేవి బయలుదేరింది. ఆమెను అడ్డగించే క్రమంలో భర్తతో వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో రమాదేవి ముఖంపై కొట్టాడు బంగార్రాజు. కిందపడిన రమాదేవి పక్కనే ఉన్న పోల్‌కు తల తగిలింది. హుటా హుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.
భర్త బంగారు రాజుకు శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించారు. అక్కడికి కుటుంబ సభ్యులు, రమాదేవి సహచరులు, డ్యాన్సర్లు భారీగా చేరుకున్నారు. ఎక్కడైనా భర్త దాడిలో భార్య ప్రాణాలు కోల్పోతే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం.. భర్త బంగారు రాజుకు శిక్ష తగ్గించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు సహచరులు. ఎందుకంటే ఇద్దరూ అన్యోన్య దాంపత్యంలో.. క్షణికావేశంలో ఘటన జరిగిందే తప్ప.. కావాలని బంగార్రాజు రమాదేవి ప్రాణాలు తీయలేదని అంటున్నారు. అంతేకాదు.. తల్లి రమాదేవి ప్రాణాలు కోల్పోయింది, ఇప్పుడు భర్త బంగార్రాజుకు శిక్ష పడితే మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన.
సంశయంలో పడ్డ పోలీసులు
దీంతో ఈ కేసులో ఏం చేయాలో తెలియక పోలీసులు సంశయంలో పడ్డారు. చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు బంధువులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడైన రమాదేవి భర్త బంగార్రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related Posts
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, పిడుగులు ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు Read more

CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ
State revenue to grow by 2.2 percent.. CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలోని పొన్నెకల్లును సందర్శించనున్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అక్కడ ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి Read more

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more

Fishermen : ఏపీలో మత్సకారుల ఖాతాల్లో 20 వేలు
Fishermen ap 20 k

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్సకారులకు వేసవిలో ఆర్థిక భారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రూ.20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×