Rishabh Pant: వికెట్ల వెనుక రిషభ్ పంత్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతి బంతికీ ఏదో ఒక మాటతో బ్యాటర్లను రెచ్చగొట్టడం, బౌలర్లను ఉత్సాహపరచడం పంత్‌కు అలవాటే. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనూ పంత్ తనదైన శైలిలో సందడి చేశాడు. అయితే ఆయన చేసే కామెంట్లు కొన్నిసార్లు ప్రత్యర్థి బ్యాటర్ కంటే సొంత జట్టు బౌలర్లనే ఇబ్బంది పెడతాయని మాజీ క్రికెటర్ అజింక్య రహానె అన్నాడు.
పంత్ ఎప్పుడూ అంతే..
రిషభ్ పంత్ ఎప్పుడూ సరదాగా ఉంటాడని రహానె చెప్పాడు. శ్రీలంక ఆటగాళ్లకు హిందీ అర్థం కాకపోవడంతో పంత్ చేసే కామెంట్లతో ప్రత్యర్థి బ్యాటర్ ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అయితే అదే సమయంలో స్లిప్స్, షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు మాత్రం బంతిపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించాడు.
Read Also : Ravindra Jadeja: టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్న రవీంద్ర జడేజా

క్యాచ్ వచ్చే సమయంలో పంత్ చేసే కామెంట్ల కారణంగా ఫీల్డర్ల దృష్టి మళ్లితే బౌలర్లు కోపానికి గురయ్యేవారని రహానె గుర్తుచేసుకున్నాడు. తాను భారత జట్టులో ఉన్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లు కూడా పంత్ మాటలతో ఇబ్బంది పడేవారని తెలిపాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను డిస్టర్బ్ చేయాలని, కానీ సొంత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయకూడదని పంత్‌కు చెప్పాల్సి వచ్చేదని రహానె పేర్కొన్నాడు.
Rishabh Pant: ‘అందరం కలిసి కత్తులు తిప్పుదాం’.. పంత్ కామెంట్ వైరల్
శ్రీలంకతో టెస్టులోనూ పంత్ తన చమత్కారంతో నవ్వులు పూయించాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి స్టంప్ మైక్‌లో వినిపించిన పంత్ సంభాషణ ఆసక్తికరంగా మారింది. జడేజా ఇంకా బౌలింగ్‌కు రాకపోవడంతో సర్ఫరాజ్.. ‘లాంగ్ గేమ్.. అందరం కలిసి వికెట్లు పంచుకుందాం’ అన్నాడు. దీనికి పంత్ వెంటనే స్పందిస్తూ.. ‘అందరం కలిసి కత్తులు తిప్పుదాం’ అంటూ జడేజా వికెట్ సెలబ్రేషన్‌ను ప్రస్తావించాడు. స్టంప్ మైక్‌లో రికార్డైన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :