భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపై కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 27 శాతం సుంకాలు విధించింది. దీనివల్ల ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారుల వివరాల ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 27% సుంకం విధించింది. ఇప్పటికే భారతదేశ రొయ్యలపై అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీతో పాటు, 5.7% కౌంటర్ వయలింగ్ సుంకం (సీవీడీ) వసూలు చేస్తోంది. ఈ సుంకాలన్నీ కలుపుకుంటే దాదాపు 35 శాతానికి పైగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

‘లక్షలో సగం పన్నులు, ఖర్చులకే’
తాజా సుంకాలను కలుపుకుంటే లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే ఇప్పుడు రూ.26,000 సుంకం చెల్లించాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వయోలిన్ డ్యూటీ కూడా కలిపితే రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి రవాణా, ప్యాకింగ్ ఖర్చులు అదనం. లక్ష రూపాయల్లో సగం ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని కొందరు రైతులు చెప్పారు.
”నేను ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాను. తీరా సోమవారం రొయ్య పట్టిన తర్వాత మార్కెట్‌కి ఫోన్ చేస్తే వంద కౌంట్‌కి 40 రూపాయలు తగ్గిందని చెప్పారు. అదేమంటే అమెరికాలో తగ్గించారని చెప్పారు. అమెరికా సుంకం ప్రభావంతో గత వారం నుంచి రొయ్యల ధరలు తగ్గిపోయాయని రైతులు చెబుతుంటే మార్కెట్‌లో రొయ్యలు అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ధర తగ్గినా తమకు పెద్దగా బేరాలు లేవని అంటున్నారు.
READ ALSO: Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు