అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

Donald Trump: అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

అమెరికాలోని షాపింగ్ మాల్స్ గత కొన్ని వారాలుగా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాలే. దిగుమతి సుంకాల పెంపు కారణంగా ధరలు పెరగనుండడంతో, వస్తువుల ధరలు పెరగకముందే కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్ కు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా పెరిగాయని పలు సర్వేలు చెబుతున్నాయి.

Advertisements
అమెరికాలో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్స్

32% వరకు ధరలు పెరిగే అవకాశంతో రద్దీ
కొత్త టారిఫ్ విధానం కారణంగా తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుమారు 32% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలు వంటి వస్తువులు ధరలు భారీగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ప్రజలు భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే భయంతో ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం
ఈ పరిస్థితిపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి… నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
నేటి నుంచి అమలు
ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10% సుంకం వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Related Posts
భారతీయ మార్కెట్లోకి జేవీసీ
JVC into the Indian market

· ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13, 2025న ప్రారంభమవుతుంది. · రూ. 11,999 నుండి ప్రారంభమయ్యే అద్భుతమైన మేడ్ Read more

శ్రీ మోటపర్తి శివ రామవర ప్రసాద్ “అమీబా”
“Amoeba” beautifully describes the journey of Telugu industrialist Mr. Motaparti Siva Ramavara Prasad.

హైదరాబాద్ : ఆఫ్రికన్ దేశాలలో కార్పొరేట్ రంగాన్ని పునర్నిర్మించిన మార్గదర్శక వ్యవస్థాపకుడు శ్రీ మోటపర్తి శివరామ వర ప్రసాద్ యొక్క అసాధారణ కథను ప్రముఖ రచయిత శ్రీ Read more

దేశీయ పర్యాటకుల కోసం కేరళ పర్యాటక శాఖ ప్రచారం
Kerala Tourism Department has launched an India wide campaign to increase the number of domestic tourists during summer

రాబోయే పాఠశాల వేసవి సెలవుల్లో కుటుంబాలు సెలవులను కేరళలో వినియోగించుకునేలా చేసే లక్ష్యంతో ప్రచారం.. హైదరాబాద్: “వేసవి సెలవుల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాల సెలవు సమయాన్ని Read more

మస్క్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎలోన్ మస్క్ హెచ్చరిక

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్‌ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×