నిన్న గురువారం ప్రపంచ మార్కెట్లు క్షీణించినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ పర్ఫార్మెన్న్ కనబరిచింది, కానీ శుక్రవారం ఉదయం సెన్సెక్స్ అండ్ నిఫ్టీ భారీ క్షీణతను చూశాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయి 75,435 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 1% పైగా పడిపోయి 22,921 స్థాయిని తాకింది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 3% వరకు పడిపోయాయి.

ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షణత
ఔషధ రంగానికి ప్రత్యేక సుంకం విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షిణించింది. ఈ ప్రకటన తర్వాత, భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. అలాగే గురువారం నాటి ఆనందం ఇవాళ ఆవిరైంది. ఈరోజు ఫార్మా స్టాక్స్ 2% నుండి 7% మధ్య పడిపోయాయి. ఐపీసీఏ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, లుపిన్ వంటి కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6% పైగా పడిపోయి 20,089 స్థాయిని తాకింది.
ప్రపంచ ఆర్థిక ఆందోళనలు
లైవ్ మింట్ ప్రకారం, మార్కెట్ క్యాప్ ఒకే రోజులో రూ.8 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ. 405 లక్షల కోట్లకు చేరుకుంది. ట్రంప్ సుంకాల విధానం, ప్రపంచ ఆర్థిక ఆందోళనలు, కార్పొరేట్ ఫలితాలపై అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో షేర్ మార్కెట్ దిశ ప్రపంచ సంకేతాలు ఇంకా కార్పొరేట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు : 1. కొత్త సుంకాల గురించి ట్రంప్ హెచ్చరిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఔషధ దిగుమతులపై సుంకాలను ప్రకటించారు.