Samantha: గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని కోరిన సమంత

Samantha: గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని కోరిన సమంత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, యూనివర్సిటీ భూసంపదను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.

Advertisements

విద్యార్థులు ఆందోళన

కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా అభివృద్ధి చేసి, ఐటీ సంస్థలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండటంతో, ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స‌మంత స్పందన

ఈ వివాదం నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనలో విద్యావేత్తలతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా తమ మద్దతు ప్రకటిస్తున్నారు.ఈ వివాదంపై ఇప్ప‌టికే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్, డైరెక్ట‌ర్‌ త‌రుణ్ భాస్క‌ర్, న‌టుడు ప్రియ‌ద‌ర్శి, ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌, యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్, ఈషా రెబ్బా త‌దిత‌రులు కూడా స్పందించారు. తాజాగా ఈ వివాదంపై న‌టి స‌మంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. హెచ్‌సీయూ 400 ఎక‌రాల క‌థ‌నంపై ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక తెలంగాణ టుడేలో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన స‌మంత, కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ కోరారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ వేదిక‌గా Change.org (సామాజిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించే సంస్థ‌) పిటిష‌న్‌కి సైన్ చేయాల‌ని కోరారు.

HCU Land Row

యూనివర్సిటీకి భూముల కేటాయింపు

1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటగా, అబిడ్స్‌లో గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించగా, ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు.2003లో, రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే, నిర్దేశిత సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించకపోవడంతో, 2006లో ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేసింది.

డ్రోన్ చిత్రాలు

ఇప్పటికే జేసీబీలు పెద్దసంఖ్యలో అక్కడ పనులు చేస్తున్నాయి.అప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లు, పొదలను తొలగించి చదును చేసే పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాత్రిళ్లు కూడా పనులు కొనసాగుతున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు.”ఇప్పటికే సగం అడవిని చదును చేసేశారు. రాత్రిళ్లు కూడా పనులు చేస్తుండటంతో నెమళ్లు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. మా విద్యార్థులందరికీ చాలా బాధగా అనిపిస్తోంది.” అని అంబేడ్కర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెన్నెల చెప్పారు.ప్రస్తుతం వివాదం నడుస్తున్న ప్రాంతానికి సంబంధించి స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేశారు. అందులో పెద్దసంఖ్యలో పొక్లెయిన్లు పనులు చేస్తున్నట్లుగా ఉంది.అందులో ఒక చెరువు కూడా కనిపిస్తోంది.”చదును చేస్తున్న ప్రాంతంలోనే పీకాక్ లేక్ ఉంది.

Related Posts
Hyderabad : తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం
Hyderabad తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం

Hyderabad : తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి,సిద్దిపేట,యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి Read more

ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా
WhatsApp Image 2025 02 05 at 17.25.58 69208124

ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రామ‌ల్కాజిగిరిలో 1200 గజాల స్థ‌లానికి క‌బ్జాల‌ నుంచి విముక్తి. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ప్రక్రియ అనుకున్నదాని కన్నా సులభంగా పూర్తయింది. న‌గ‌రంలోని Read more

తాజ్ బంజారా హోటల్‌కి షాక్: జీహెచ్ఎంసీ సీజ్
GHMC seizes Taj Banjara Hotel in Hyderabad

హైదరాబాద్‌లో తాజ్ బంజారా హోటల్ సీజ్ – రూ.1.43 కోట్ల పన్ను బకాయి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ హోటల్ తాజ్ బంజారా గణనీయమైన పన్ను Read more

Hyderabad : ఎల్లుండి వైన్ షాపులు, బార్లు బంద్
Hyderabad ఎల్లుండి వైన్ షాపులు, బార్లు బంద్

హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు ఈ వారాంతం ఊహించని షాకే తగిలింది. శనివారం జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. రెగ్యులర్‌గా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×