Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఇండియన్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నదని విమర్శించింది.ప్రధానంగా పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్‌కు తాము మిత్రులమని చెప్పే రష్యా, కావాలనే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ కూడా రష్యా దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోడౌన్‌ పూర్తిగా ధ్వంసమైందన్నారు.

Advertisements

కాల్పుల విరమణ

అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ కూడా రష్యా చేసిన దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తో సహా 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌లో ఉంది.గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- ఉక్రెయిన్‌, రష్యాలు కాల్పులు విరమణ చేయాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌లోని అనేక లక్షిత ప్రాంతాలపై దాడులు చేస్తూనే ఉంది.కాల్పుల విరమణపై చర్చించడానికి అమెరికా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ శుక్రవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. కాగా అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా నిరాకరించి శనివారం నాటికి సరిగ్గా నెల రోజులు అయ్యింది. దీనితో రష్యా చేస్తున్న దాడులే ‘శాంతి ఏకైక అడ్డంకి’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఆరోపించారు.

క్షిపణులు

జెడ్డాలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలను సిబిహా ప్రస్తావిస్తూ, ‘కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. కానీ రష్యా మాత్రం దీనికి నిరాకరించింది. బదులుగా షరతులు, డిమాండ్లను మా ముందు ఉంచింది’ అని అన్నారు.ఈ మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 11 వరకు రష్యా, ఉక్రెయిన్‌పై ఏకంగా 70 రకాల క్షిపణులను, 2,200 కంటే ఎక్కువ షాహెద్ డ్రోన్‌లను, 6,000 కంటే ఎక్కువ గైడెడ్‌ వైమానిక బాంబులను ప్రయోగించిందని సిబిహా అన్నారు.

Read Also: NASA : రోదసి వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎలా? పరిష్కారం సూచిస్తే రూ.25.82 కోట్లు బహుమతి: నాసా

Related Posts
దావోస్ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20న దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు Read more

Donald Trump : అమెరికా సుంకాల పెంపునకు చైనా కౌంటర్
Donald Trump అమెరికా సుంకాల పెంపునకు చైనా కౌంటర్

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది.ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మళ్లీ సంచలనంగా మారింది.చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధించారు ట్రంప్.దీంతో కలిపి మొత్తం సుంకాలు Read more

ఘనంగా చైతన్య టెక్నో స్కూల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు
mattadayanadh

సత్తుపల్లి స్థానిక గుడిపాడు రోడ్ నందు గల చైతన్య టెక్నో స్కూల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఆషా స్వచ్చంద సేవా Read more

రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×