తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా కంచ గచ్చిబౌలి అడవుల నిర్మూలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యలు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఘాటుగా స్పందించారు.అతను ఆరోపించిన విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పచ్చదనం తుడిచిపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయట. విలువైన వృక్షవనాలు, వన్యప్రాణులు ఈ చర్యల వల్ల తీవ్రంగా నష్టపోయాయని ఆయన ఆరోపించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సరిహద్దుల్లో ఉన్న చిట్టడవి ప్రాంతంలో ఇటీవల 100 ఎకరాలకుపైగా చెట్లు నరికివేయడం జరిగింది. దీనివల్ల అడవిలో నివసించే జంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ నరమేధం వల్ల ఒక జింక ప్రాణాలు కోల్పోయింది.

కేటీఆర్ తెలిపినట్టు, ఆ జింక జనావాసాల్లోకి చేరడంతో కొన్ని కుక్కలు దాడి చేశాయి.గాయాల వల్ల జింకను వెటర్నరీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అది ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘోర ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఈ నిర్దయమైన చర్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతులపై రక్తపు మరకలు అంటాయి,” అని ఘాటుగా విమర్శించారు.“వన్యప్రాణుల హత్యపై సుప్రీంకోర్టు జోక్యం అవసరం,”అని కేటీఆర్ అన్నారు.వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినా, వారు వాటిని రక్షించడానికి కాకుండా, నాశనం చేస్తున్నారని విమర్శించారు.వాతావరణ సమతుల్యత కోసం అడవులు అత్యంత కీలకమని, కానీ 100 ఎకరాల్లో ఉన్న పచ్చదనాన్ని మూడు రోజుల్లోనే నాశనం చేయడం విచారకరమని అన్నారు.ఆడవులు కట్ అవ్వడం వల్ల జింకలు జనావాసాల వైపు వలస వెళ్తున్నాయి. పౌరులు వాటికి నీళ్లు, తిండి ఇచ్చి ఆదరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.కానీ ఇది పర్యావరణ అసమతుల్యతకు సంకేతమని అన్నారు.అడవులు లేకపోతే, వన్యప్రాణులకు జీవితం లేదు.
వాటిని వేరే చోటకు తరలించగలగకపోవడమూ ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు.కేటీఆర్ మాటల్లో, “ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి అతి క్రూరంగా చెట్లు నరికిస్తున్నారు.”ఈ చర్యలు పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు నష్టం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు.ఇందువల్ల జనం ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ప్రజలు అడవుల అవసరాన్ని గుర్తిస్తున్నారని, ఈ విధ్వంసాన్ని చూసి తీవ్రంగా బాధపడుతున్నారని అన్నారు.ఈ అడవి నాశనానికి వెనుక రాజకీయ ప్రయోజనాలే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో ప్రకృతి నాశనానికి ప్రోత్సహించడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు.
అంతేకాదు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లేకుండా అడవులు తొలగించడంపై కోర్టులు స్పందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం అసహ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజలు ఇప్పుడు ఎక్కువగా పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. అడవుల వల్ల వచ్చే లాభాలు, వాతావరణంపై ప్రభావం, వన్యప్రాణుల రక్షణ వంటి అంశాలను బాగా తెలుసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అడవులను నాశనం చేయడాన్ని ప్రజలు సహించరు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఈ చర్యలు కొనసాగితే, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మద్ధతు తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.