Revanth govt key decision on rythu bharosa?

రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు సంక్రాంతి నుంచి రైతు భరోసా అందిస్తామని చెబుతున్నారు. గతంలో భూమి ఉన్న రైతులు అందరికీ కేసీఆర్ రైతు భరోసా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు కటాఫ్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా లిమిట్ పెడతారని టాక్ వినిపిస్తోంది.

Advertisements

ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులకు సైతం రైతుభరోసా ఇవ్వకూడదని కేబినెట్ సబ్ కమిటీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రైతు భరోసాపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందిస్తారని సమాచారం. కాగా, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ సీజన్‌కు ఒకసారి ఎకరాకు రూ.7500 ఇవ్వనున్నారు.

ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం లక్ష్యం చిన్న, సన్నకారు రైతుల పరిస్థితిని మెరుగుపరచడమే. ఎకరాల పరిమితిని నిర్దేశించడం ద్వారా ఈ పథకం తగినవారికి మాత్రమే అందుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు వాస్తవంలో ఏ విధంగా అమలవుతాయో చూడాల్సి ఉంది.

Related Posts
బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్
బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ ఢిల్లీని "భారతదేశ నేర రాజధాని"గా మార్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బీజేపీపై తీవ్రంగా విమర్శలు Read more

Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం
Earthquake: పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం

ద్వీప దేశమైన పపువా న్యూ గినియా మరోసారి ప్రకృతి విపత్తుకు గురైంది. శనివారం అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా Read more

యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలకు సీఎం కీలక ఆదేశాలు
CM Revanth Reddy to Youth Congress and NSUI leaders

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి హైదరాబాద్‌: గ్యాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సి వ్యూహాలపై శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ Read more

Entrance Exam : కామన్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజీలు – విద్యార్థుల ఆత్మహత్యల కారణాలు
Entrance Exam : కామన్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజీలు – విద్యార్థుల ఆత్మహత్యల కారణాలు

కామన్ ఎంట్రెన్స్ లీకేజీలు – ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్న కామన్ ఎంట్రన్స్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన అంశం తీవ్రమైన సమస్యగా మారింది. Read more

Advertisements
×