Today Rasi Phalalu : రాశి ఫలాలు – 17 జనవరి 2026
మేష రాశి
సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు, కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి, సోదరుల కలయిక మరియు మిత్రుల సమ్మేళనంలో ఆనందాన్ని పొందుతారు.
వృషభ రాశి
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, నూతన అవకాశాలు ఎదురవుతాయి, ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార సంబంధిత కార్యకలాపాలు సులభంగా ముందుకు వెళ్ళి, మీరు దీర్ఘకాలిక లాభాలను పొందగలుగుతారు.
…ఇంకా చదవండిమిథున రాశి
ఎంతోకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి, జీవన భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి, ఆర్థిక, కుటుంబ సమస్యల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి.
…ఇంకా చదవండికర్కాటక రాశి
ఉద్యోగులలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది, ప్రతీ ప్రయత్నం ఇప్పుడు సానుకూలంగా మారుతుంది.
…ఇంకా చదవండిసింహ రాశి
సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట పొందుతారు. కుటుంబ మరియు మిత్రులతో సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత జీవితంలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి.
…ఇంకా చదవండికన్యా రాశి
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు, జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
…ఇంకా చదవండితులా రాశి
పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలంగా మార్చేందుకు కృషి చేస్తారు. కొత్త అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి, ప్రతీ ప్రయత్నం ఫలప్రదంగా ఉంటుంది.
…ఇంకా చదవండివృశ్చిక రాశి
స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కుటుంబంలో శాంతి కాపాడుకోవాలి.
…ఇంకా చదవండిధనుస్సు రాశి
ఊహించని విధంగా అవకాశాలు పొందుతారు. కొత్త కార్య క్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక, సామాజిక లాభాలు కనిపిస్తాయి.
…ఇంకా చదవండిమకర రాశి
ఋణబాధల నుండి విముక్తి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.
…ఇంకా చదవండికుంభ రాశి
స్పెక్యులేషన్ లాభించదు, పనులు నిదానంగా పూర్తి చేయండి. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి సమయాన్ని సక్రమంగా ఉపయోగించండి.
…ఇంకా చదవండిమీన రాశి
వివాదాలకు దూరంగా ఉండండి, దూరప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం, కుటుంబ మరియు వ్యక్తిగత సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి.
…ఇంకా చదవండివారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , దక్షిణాయణం హేమంత ఋతువు, కృష్ణపక్షం,ఉత్తరాషాఢ కార్తె
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.