Today Rasi Phalalu : రాశి ఫలాలు – 11 ఫిబ్రవరి 2026
మేష రాశి
కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురైనా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమైనవే తప్ప దీర్ఘకాల ప్రభావం చూపే పరిస్థితులు కావు. ఆలోచనల్లో కలత ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
వృషభ రాశి
విదేశాలలో నివసిస్తున్న మీ బంధువుల నుండి సహాయసహకారాలు అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడంతో ఆనందకరమైన వార్తలు వింటారు.
…ఇంకా చదవండిమిథున రాశి
కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన జఠిలమైన సమస్యలు ఇప్పుడు క్రమంగా పరిష్కారమవుతాయి. మీరు పెట్టిన ప్రయత్నాలకు సరైన ఫలితం లభించడంతో మనసుకు ఊరట కలుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ గాడిలో పడతాయి.
…ఇంకా చదవండికర్కాటక రాశి
భూముల విషయంలో ఏర్పడిన వివాదాలు ఇప్పుడు పరిష్కార దశకు చేరుకుంటాయి. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. చట్టపరమైన అంశాల్లో అనుకూల సంకేతాలు కనిపిస్తాయి.
…ఇంకా చదవండిసింహ రాశి
సంతాన విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు. పిల్లల చదువుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
…ఇంకా చదవండికన్యా రాశి
రాజకీయ, కళా రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు, సేవలకు గుర్తింపుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.
…ఇంకా చదవండితులా రాశి
బ్యాంకు ఋణాలు మంజూరయ్యే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడంతో ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. రుణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగి, అవసరమైన నిధులు సమయానికి అందుతాయి.
…ఇంకా చదవండివృశ్చిక రాశి
అన్ని అవకాశాలు అప్రమేయంగా మీకు లభించే కాలంగా ఇది కనిపిస్తోంది. మీరు ఆశించని విధంగా అవకాశాలు తలుపుతడతాయి. గతంలో చేసిన కృషికి ఫలితాలు దక్కుతూ, అదృష్టం మీ వైపే ఉందన్న భావన కలుగుతుంది.
…ఇంకా చదవండిధనుస్సు రాశి
ఎంతగానో శ్రమించి, వ్యయప్రయాసలకూర్చి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా, మీ పట్టుదల వాటిని దాటించేస్తుంది.
…ఇంకా చదవండిమకర రాశి
విద్యార్థినీ, విద్యార్థులు ఈ సమయంలో చదువుపై మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు.క్రమబద్ధమైన చదువు విధానం అలవాటు చేసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.
…ఇంకా చదవండికుంభ రాశి
నిర్మాణ సంబంధమైన విషయాల్లో ఈ సమయంలో ఆచి, తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణం, మరమ్మత్తులు లేదా భూమికి సంబంధించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
…ఇంకా చదవండిమీన రాశి
ఈ సమయంలో కుటుంబ సమస్యల పైన మీ దృష్టి ఎక్కువగా సారిస్తుంది. ఇంటి విషయాల్లో పరిష్కారం అవసరమైన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను తొలగించేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
…ఇంకా చదవండివారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మాఘమాసం , ఉత్తరాయణం శిశిర ఋతువు, కృష్ణ పక్షం శ్రావణ కార్తె