Today Rasi Phalalu : రాశి ఫలాలు – 04 డిసెంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
మీరు చేపట్టే పనుల్లో పలురంగాల పట్ల ఉన్న అనుభవం ఈ రోజు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించే తీరుగలుగుతారు.
వృషభరాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం కానున్నాయి. పథకం ప్రకారం పనులు పూర్తయ్యే వేగం తగ్గినా, సహనం పాటించడం వల్ల పరిస్థితులు మీ అనుకూలంగా మారతాయి.
…ఇంకా చదవండిమిథున రాశి
ఈ రోజు మీ పరిసరాలలో ఉన్నవారి మనోభావాలు అతి సున్నితంగా మారే అవకాశముంది. “కరవమంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం” అన్నట్టు, మీరు ఏం మాట్లాడినా లేదా ఏం చెప్పినా ఎవరికీ సర్దిచెప్పలేని పరిస్థితి ఎదురవచ్చు.
…ఇంకా చదవండికర్కాటక రాశి
ఈ రోజు మీరు చాలాకాలంగా ఆలోచిస్తున్న ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. దైవం మీద భారం వేసి, “ఇది సరైన సమయమే” అనుకుంటూ ముందుకు సాగుతారు.
…ఇంకా చదవండిసింహ రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు, పెద్ద మొత్తాలు, రిస్క్ ఉన్న వ్యవహారాల్లో తొందరపడకుండా ఉండటం మంచిది.
…ఇంకా చదవండికన్యా రాశి
ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా విపక్షం చేస్తున్న విమర్శలు, ఒత్తిడులు, సవాళ్లు మీ ధైర్యాన్ని అసలు తగ్గించవు.వాటిని ఎదుర్కొనేంత బలమైన మనోస్థైర్యం ఈ రోజు మీలో స్పష్టంగా కనిపిస్తుంది.
…ఇంకా చదవండితులా రాశి
ఈ రోజు మీ మనసులో కొంత భారంగా అనిపించవచ్చు. చిన్న విషయాలపైనా మానసిక వత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా రెండుసార్లు ఆలోచించాలనిపిస్తుంది.
…ఇంకా చదవండివృశ్చిక రాశి
ఈ రోజు మీకు పెద్దగా ఇబ్బందులు లేకుండా పనులు సాఫీగా సాగుతాయి. అయితే స్త్రీలతో మాటలలో, వ్యవహారాలలో కొద్దిగా జాగ్రత్త అవసరం.
…ఇంకా చదవండిధనుస్సు రాశి
ఈ రోజు మీరు మాట్లాడే మాటల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. తొందరపాటుతో మాట్లాడిన మాటలు లేదా పరుషంగా చెప్పిన వ్యాఖ్యలు తగారాలకు దారి తీసే అవకాశం ఉంది.
…ఇంకా చదవండిమకర రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవిగా మారవచ్చు. ఋణం చేయడం, అఋణం ఇవ్వడం రెండు కలిసిరావు అన్నట్లు, డబ్బు లావాదేవీల్లో కొద్దిగా అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది.
…ఇంకా చదవండికుంభ రాశి
ఈ రోజు ముఖ్యంగా సినీరంగం, కళారంగం, ఫ్యాషన్ లేదా వస్త్ర వ్యాపారాలకు చెందినవారు కొద్దిగా అప్రమత్తంగా ఉండటం అవసరం. పోటీ, విమర్శలు, ఆకస్మిక మార్పులు తలెత్తే అవకాశం ఉంది.
…ఇంకా చదవండిమీన రాశి
ఈ రోజు మీ కోసం ప్రత్యేకంగా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వివాదాలు, కుటుంబ భూములు, పంచాయితీలు వంటి సమస్యలు సానుకూల దిశగా పరిష్కారమవుతాయి.
…ఇంకా చదవండివారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)