Rahul Gandhi: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇచ్చే టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల.. సముద్ర జీవాల మనుగడకు ప్రమాదంగా మారుతుందన్నారు. ప్రైవేటు కంపెనీలకు ఆఫ్‌షోర్ మైనింగ్ అనుమతి ఇవ్వడం ఆందోళనకరంగా ఉందన్నారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవిలో మైనింగ్‌కు పర్మిట్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.

పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండానే అనుమతులు
తమ జీవనోపాధి, జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని లక్షల సంఖ్యలో జాలర్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు రాహుల్ తన లేఖలో గుర్తు చేశారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా, పర్యావరణ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు రాహుల్ తన లేఖలో తెలిపారు. ఆఫ్‌షోర్ మైనింగ్ కోసం టెండర్లు నిర్వహించిన ప్రక్రియను కోస్టల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండానే అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
మత్స్య సంపద కూడా తగ్గిపోతుందని
ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ నేత తెలిపారు. ఆఫ్‌షోర్ మైనింగ్‌తో మెరైన్ లైఫ్‌కు ప్రమాదం ఏర్పడుతుందని, కోరల్ రీఫ్స్ డ్యామేజ్ జరుగుతుందని, మత్స్య సంపద కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. 13 ప్రదేశాల్లో ఆఫ్ షోర్ మైనింగ్ కోసం ఖనిజ మంత్రిత్వశాఖ టెండర్లు ఆహ్వానించింది. ఆ సమయంలో తీవ్ర నిరసనలు జరిగినట్లు రాహుల్ తన లేఖలో తెలిపారు. కొల్లాంలో మెరైన్ మానిటరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల ఫిష్ బ్రీడింగ్ సమస్య ఏర్పడనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.