Weather: అకాల వర్షాలతో ఏపీలో విచిత్ర వాతావరణం..

Weather: అకాల వర్షాలతో ఏపీలో విచిత్ర వాతావరణం..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Advertisements

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాలు

బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లాలో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తేలికపాటి వర్షాలు

ఈరోజు అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందట. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-7, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో(23) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

మోస్తరు వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ఎవరూ చెట్లు క్రింద నిలబడకూడదన్నారు.మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మరో రెండు వారాలపాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

ద్రోణి ప్రభావం

తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు. ద్రోణి ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రానికి వర్షసూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Appeal to the government to

రాష్ట్రంలో తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల JAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 5వేల మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు Read more

డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి
Deputy Speaker paid tribute Dr. BR Ambedkar

అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి Read more

నవంబర్ 09 న విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగం
నవంబర్ 09 న విజయవాడ-శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ప్రయోగం

విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్’ సర్వీసును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న శ్రీకారం చుట్టబోతున్నారు. డీ హవిల్లాండ్ కంపెనీ Read more

Vijayasai Reddy: విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasai Reddy: విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరైనది ఏపీలోని లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×