Pastor Praveen :మీడియాకు ప్రవీణ్ భార్య విన్నపం

Pastor Praveen :మీడియాకు ప్రవీణ్ భార్య విన్నపం

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు.సీసీ కెమేరాల్లో రికార్డు అయిన విజువల్స్ ఈ కేసులో కీలకంగా మారాయి.బైక్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు గుర్తించారు.ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. మరో వైపు ప్రవీణ్ మరణానికి ముందు ప్రమాదానికి గురైన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పడుతూ లేస్తూ వరుస ప్రమాదా లకు ప్రవీణ్ గురైనట్లు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది.ప్రవీణ్ సతీమణి వెల్లడించిన అంశాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.

Advertisements

సతీమణి అభ్యర్దన

అదే విధంగా ప్రవీణ్ సతీమణి జెస్సికా సైతం ఇదే తరహాలో స్పందించారు. తమకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్య వాదాలు చెప్పారు. ఇలాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరమని కోరారు. ప్రవీణ్‌ పగడాల ఒక మంచి భర్త, మంచి తండ్రిగా పేర్కొన్నారు. ఆయన భౌతికంగా లేరని తెలిశాక తాము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం వేగంగా స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు.దర్యాప్తుపై తమకు నమ్మకముందనిదయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

టోల్‌గేట్‌

ప్రవీణ కుమార్ కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేసారు. జగ్గయ్యపేట వద్ద ముందుగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వస్తుంది. ఇది దాటిన తర్వాత కీసర టోల్‌ప్లాజా. ప్రవీణ్‌కుమార్‌ 24వ తేదీ మధ్యాహ్నం 3.52 గంటలకు వేగంగా వస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.తిన్నగా వెళ్లిపోవడంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రదేశంలో పడిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల ఫుటేజీలో కనిపిస్తున్నాయి.దీన్ని టోల్‌ప్లాజా సిబ్బంది సైతం ధ్రువీకరించారు. బుల్లెట్‌పై నుంచి పాస్టర్‌ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

Capture

ఇలాంటి చర్యలను ఆపివేయాలని. ఆయన ఎప్పుడూ మత సామర స్యాన్నే కోరుకున్నారు. మేం ప్రభుత్వ దర్యాప్తును పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయవద్దని ప్రవీణ్ సోదరుడు కిరణ్ కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ వేర్వేరుగా వీడియో విడుదల చేశారు. కిరణ్ తన వీడియో లో ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరూ సొంత దర్యాప్తులు ఆపాలని కోరారు.ప్రవీణ్‌ పగడాల ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని చెప్పారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు ప్రవీణ్‌ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరికొందరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Related Posts
Chandrababu Naidu : అభివృద్ధి, సంక్షేమమేమా లక్ష్యం
Chandrababu Naidu : అభివృద్ధి, సంక్షేమమేమా లక్ష్యం

దళితుల అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను దళిత, బహుజన వర్గాలకు ఏపీలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, Read more

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది
ఎంపిహెచ్ఎల తొలగింపుపై

ఎంపిహెచ్ఎల తొలగింపుపై మండలిలో ప్రశ్న – మంత్రి సమాధానం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అమరావతి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతిపదికపై Read more

దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా ఏంటి..?: సోమిరెడ్డి
somireddy chandra mohan reddy comments on vijayasai reddy

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి Read more

Nandyal Hijras: నంద్యాలలో హిజ్రాల మధ్య ఘర్షణ
Nandyal Hijras: నంద్యాలలో హిజ్రాల మధ్య ఘర్షణ

నంద్యాలలో హిజ్రాల భిక్షాటన వివాదం - వీధి పోరాటాలకు దారి నంద్యాల జిల్లాలో హిజ్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. భిక్షాటన హక్కులపై వివాదం కారణంగా, నంద్యాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×