Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisements

ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వీరిద్ద‌రూ ఆయా ప‌ద‌వుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.

ఈ రెండు నియామ‌కాల‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇంఛార్జి వీసీల‌ను ప్ర‌భుత్వం మార్చింది. కోఠి మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధనావత్‌ సూర్య, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను నియమించారు. కాగా, సూర్య ప్ర‌స్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Related Posts
మెడిక‌ల్ విద్యార్థుల‌కు కాంగ్రెస్ మోసం: హ‌రీశ్‌రావు
harish rao

మెడిక‌ల్ విద్యార్థుల‌కు జ‌రిగిన న‌ష్టానికి పూర్తి బాధ్య‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ అడ్మిషన్‌ల‌లో కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ Read more

ఇక నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘డయల్ 112’
112 dail

తెలంగాణ రాష్ట్రంలో అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నంబర్‌ వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రజలు డయల్ 100 (పోలీసు), 108 (ఆరోగ్య అత్యవసర సేవలు), Read more

టెట్ ఫ‌లితాలు విడుదల .
tet results

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు Read more

Justice Rajasekhar Reddy : తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి
Justice Rajasekhar Reddy2

తెలంగాణ రాష్ట్రంలో నూతన లోకాయుక్త నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ లోకాయుక్తగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుభవం, Read more

×