Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వీరిద్ద‌రూ ఆయా ప‌ద‌వుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.

ఈ రెండు నియామ‌కాల‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇంఛార్జి వీసీల‌ను ప్ర‌భుత్వం మార్చింది. కోఠి మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధనావత్‌ సూర్య, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను నియమించారు. కాగా, సూర్య ప్ర‌స్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Related Posts
18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య
Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.. హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే Read more

రవాణా శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగులు
79235154

హైదరాబాద్ : రవాణా శాఖలో డిటిసిలు, జెటిసిలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ Read more

ఐటీ దాడులపై దిల్ రాజు: 20 లక్షల నగదు కూడా దొరకలేదు!
ఐటీ దాడులపై దిల్ రాజు: 20 లక్షల నగదు కూడా దొరకలేదు!

ఇటీవల దిల్ రాజు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఐటి రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి గురించి ప్రస్తావిస్తూ, "ఐటీ అధికారులు నా దగ్గర Read more

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్‌ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *