Chandrababu Naidu : అభివృద్ధి, సంక్షేమమేమా లక్ష్యం

Chandrababu Naidu : అభివృద్ధి, సంక్షేమమేమా లక్ష్యం

దళితుల అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు

చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను దళిత, బహుజన వర్గాలకు ఏపీలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. సహపా ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. గత వైకాంగ్రెసు పార్టీ పాలకులు అమరావతిని ఎడారి అన్నారని మండిపడ్డారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారని అన్నారు.

Advertisements
maxresdefault (4)
Chandrababu Naidu

అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొనడం

94 శాతం అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు.
గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి Chandrababu నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు. బంగారు కుటుంబంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రూ.102.07 కోట్లతో నిర్మించతలపెట్టిన సాంఘిక సంక్షేమ వసతి భవనాలకు శంకుస్థాపన చేశారు.

అంబేద్కర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం గత టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికై విదేశాల్లో చదువుకుని స్థిరపడిన రత్నలత, అనిల్ అనే ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాడికొండ సమీపంలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై ఆయన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలి

బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “అందరం స్వేచ్ఛగా ఉన్నామంటే రాజ్యాంగమే కారణం” అన్నారు. 2019-24 మధ్య ప్రజలు ఆనందంగా ఉన్న రోజులే లేవని చెప్పారు. తనలాంటి వాళ్లు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలరని సీఎం అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు. మనందరికీ హక్కులు ఉన్నాయంటే అంబేద్కరే కారణమని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని అభివర్ణించారు.

దళితులకు టీడీపీ ఎప్పుడూ

దళితులకు 8 లక్షల ఎకరాలు వంచిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాటిచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయని చెప్పారు. సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గతంలో ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని చెప్పారు. ఇప్పుడు ఐటీలో మనమే నెంబర్ వన్ అని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ తయారు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని సూచించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని చెప్పారు. చాలా చోట్ల అత్యధిక సంపాదన తెలుగు వారిదేనని తెలిపారు. ప్రవాసాంద్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Read more : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ!

పొన్నెకల్లు గ్రామంలో ఇంకా 300 మందికి మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఆరు నెలల్లో వారందరికి మరుగుదొడ్లను తమ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. పొన్నెకల్లు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 24 ఇళ్లల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదని, ఆ ఇళ్లల్లో వెంటనే సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ టీడీపీ అని వివరించారు.1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మోచ్ గ్రామంలో అంబేద్కర్ జన్మించారు. ఆ రోజుల్లో బడుగులంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. అంటరానితనం, వివక్ష, అసమానత, అవమానాలపై అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారు. దళితుల కోసం యుద్ధం చేశారు. 1927లో దళితులకు నీటి హక్కు కల్పించారు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేయడమే కాకుండా తన వెంట దళితులను ఆలయానికి తీసుకెళ్లారు.

Related Posts
కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు
కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు

యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష వాన్స్ త్వరలోనే భారత్ పర్యటనకు రానున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెలలోనే ఈ Read more

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం
biden zinping

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, శనివారం పెరూ లో జరిగిన ఏషియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ఫోరమ్ సమ్మిట్ సమయంలో Read more

Pawankalyan: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు.. కాసేపట్లో సింగపూర్ కు పవన్
పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయాలు.. సింగపూర్ కు పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. Read more

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్
Today Congress Chalo Raj Bhavan

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×