Preparations underway for auction of 'Golconda Blue' diamond

Golconda Blue diamond :’ గోల్కొండ బ్లూ’ వజ్రం వేలంపాటకు సన్నాహాలు..

Golconda Blue diamond : భారతీయ రాజుల దగ్గర ఉన్న అరుదైన వజ్రం’ గోల్కొండ బ్లూ’ ను వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇందౌర్‌, బరోడా మహారాజుల వద్ద ఉన్న విలువైన సంపదలో ఇదీ ఒకటి. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే “క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్” సేల్‌లో వేలం వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వేలంలో దీని ధర దాదాపు రూ.430కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాని రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో “ది గోల్కొండ బ్లూ” ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisements
  గోల్కొండ బ్లూ వజ్రం వేలం

అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమయినట్లు తెలుస్తోంది. పూర్వం ఇందౌర్‌ను పరిపాలించిన మహారాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌-ll వద్ద ఇది ఉండేది. 1923లో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్‌లెట్‌లో పొదిగించారు. అనంతరం ఆభరణాలను రీడిజైన్‌ చేయడంలో భాగంగా ఇందౌర్‌ పియర్‌ వజ్రాలతో చేసిన నెక్లెస్‌లో “ది గోల్కొండ బ్లూ” ను అమర్చారు. ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ అప్పట్లో గీసిన ఇందౌర్‌ మహారాణి చిత్రపటంలో ఆమె ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 1947లో ఈ వజ్రాన్ని ప్రఖ్యాత న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. తర్వాత అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం దీనిని ఓ ప్రైవేటు సంస్థ సొంతం చేసుకుంది.

Related Posts
వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
vasantha panchami in 2025

వసంత పంచమి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్న భక్తులు, Read more

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం
plane crashed in Kazakhstan

అజర్‌బైజాన్: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం Read more

నేడు తెలంగాణ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌
Telangana EAPCET Notification today

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే Read more

Chandrababu: ఆంధ్రలో అన్నినియోజకవర్గాలలో ఆస్పత్రి నిర్మిస్తాం:చంద్రబాబు
ఆంధ్రలో అన్నినియోజకవర్గాలలో ఆస్పత్రి నిర్మిస్తాం:చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యం కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×