PM Modi celebrates Ram Navami in Rameswaram

PM Modi: రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి వేడుకలు..

PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది.

Advertisements
రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి

కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 2024లో ‘‘భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన’’ అని దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది హైస్పీడ్ రైళ్లు, పెరిగిన ట్రాఫిక్‌కి అనుగుణంగా నిర్మించారు.

వివాదాల వేళ తమిళనాడుకు ప్రధాని

హిందీ వివాదం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)పై ఇటీవల కేంద్రం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందీని తమపై రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని వ్యతిరేకిస్తూ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో భేటీ జరిగింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గతాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts
Drumstick : మునక్కాయల వల్ల ఎన్ని ప్రయోజనాలో.!
drumstick2

మునగకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఫోలిక్ యాసిడ్‌తో సమృద్ధిగా ఉండటంతో, గర్భిణీ స్త్రీలకు ఇది ఒక గొప్ప పోషకాహారం. గర్భధారణ సమయంలో ఫోలిక్ Read more

ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
Special meeting of Telangana Assembly today

హైదరాబాద్‌: ఒక రోజు ముందుగానే అంటే రేపు (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. Read more

మహారాష్ట్రలో దేవేంద్ర 20,000 ఓట్ల ఆధిక్యంలో, బిజేపీ విజయ కూటమి..
DEVENDRA

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ,నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వోట్ల లెక్కింపు Read more

బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.
బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.

బుల్లి రాజుగా తెరంగేట్రం చేసిన బాల నటుడు రేవంత్ భీమాల 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించిన విషయం తెలిసిందే, రేవంత్ భీమాల కు కొత్త చిక్కులు వచ్చి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×