Pawan became Deputy CM unexpectedly.. Kavitha

Kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆమె వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించడమేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Advertisements
పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం

ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా

దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారని చురకలాంటించారు. చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి అప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారు అంటూ ఆగ్రహించారు. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధం గా ఉంటాయని మండి పడ్డారు. రేపు తమిళనాడు వెళ్లి హిందీ చేయబోమనైన ఆయన చెప్పవచ్చు అంటూ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

కవిత కామెంట్స్ పై జనసేన నేతలు విమర్శలు

పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని కవిత అన్నారు. అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Related Posts
గేమ్ ఛేంజర్ షోలపై హైకోర్టు ఆగ్రహం
గేమ్ ఛేంజర్ షోలపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు గేమ్ ఛేంజర్ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పేర్కొన్న జస్టిస్ Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more

Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ
Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి (కాశీ)లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాశీవాసుల ప్రేమకు రుణపడి ఉన్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Read more

Sunita Williams : సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?
Sunita Williams arrival delayed further

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. అంతరిక్ష ప్రయాణాల్లో అనేక రికార్డులను నెలకొల్పిన ఆమె, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×