Nagavali Express derailed

Nagavali Express : పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

Nagavali Express : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న ‘నాగావళి ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మీ థియేటర్ జంక్షన్ వద్ద రైలులోని చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పట్టాలు తప్పిన రెండు బోగీలను తొలగించి.. మిగిలిన రైలును యథావిధిగా పంపించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisements
పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

సాహిబ్‌గంజ్ జిల్లాలో మరో రైలు ప్రమాద ఘటన

మరోవైపు మంగళవారం జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో మరో రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సాహిబ్‌గంజ్‌లోని బర్హెట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని .. ఫరక్కా-లాల్మాటియా ఎంజిఆర్ రైల్వే లైన్‌లో ఒక పెద్ద రైల్వే ప్రమాదం సంభవించింది. ఫరక్కా నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్ రైలు ‘బర్హెట్ ఎంటీ’ పట్టాలపై నిలబడి ఉంది. ఇంతలో లాల్మాటియా వైపు వెళ్తున్న బొగ్గుతో ఉన్న త్రూపాస్ గూడ్స్ రైలు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లోకో పైలట్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలా రెండు రైళ్లు ఢీకొట్టాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts
CM Chandrababu : బాబు జగ్జీవన్ రామ్‌కి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu pays tribute to Babu Jagjivan Ram

CM Chandrababu : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భారతదేశ Read more

దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆ దావాలకు చట్టబద్ధత లేదని మాజీ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం Read more

Bangladesh :షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించం: బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం
షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించం: బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం

హసీనా ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలుషేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ 15 ఏళ్ల పాలనలో విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపణలు. గత Read more

మస్క్‌కు భారతీయ యువకుడు సవాల్!
ఎలాన్ మస్క్ మీకు చేతనైతే నిధులు సేకరించకుండా నన్ను అడ్డుకోండి’ అని ఎక్స్ (ట్విట్టర్)‌లో సవాల్ విసిరారు.

పెర్ప్లెక్సిటీ AI యొక్క CEO అరవింద్ శ్రీనివాస్, తన టెస్లా కౌంటర్పార్ట్ ఎలోన్ మస్క్‌ను ఫెడరల్ ఏజెన్సీ నుండి భారీ మొత్తాన్ని సేకరించకుండా "ఆపమని" సవాలు చేశాడు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×