భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్

భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్

గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత భవిష్ అగర్వాల్ కలల ప్రాజెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న హీట్ తగ్గించుకునే క్రమంలో స్టాక్ కొన్ని స్టెప్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ మోబిలిటీ 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించిందని వెల్లడైంది. దేశంలో ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ ఓలా భారీగా పెరిగిన నష్టాలను తగ్గించుకోవటానికి ఈ చర్యలకు ఉపక్రమించింది. సోఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ పెట్టుబడి మద్దతు పొందిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రొక్యూర్మెంట్ నుంచి ఛార్జింగ్ ఇన్ ఫ్రా వరకు అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.

Advertisements
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్


గడచిన 5 నెలల కాలంలో కంపెనీ రెండోసారి జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులు కావటం గమనార్హం. సంస్థ ఈనెల ఆగస్టులో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత డిసెంబరు త్రైమాసికంలో సంస్థ నష్టాల్లో 50% పెరుగుదలను నమోదు చేయటం తెలిసిందే. అలాగే ఇటీవల భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ అండ్ వినియోగదారుల రక్షణ సంస్థల నుండి కంపెనీ విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది నవంబరులో సుమారు 500 మంది ఉద్యోగులు తొలగించబడ్డారు. అలాగే ఓలా తమ కస్టమర్ సంబంధాల కార్యకలాపాలను ఆటోమేటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది.

మరింత మందిని తొలగించే అవకాశం

ఈ తొలగింపు ప్రణాళికలు వ్యాపార అవసరాల ప్రకారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన కార్యకలాపాలను ఆటోమేటెడ్ చేయడం ద్వారా మెరుగైన మార్జిన్లు, తగ్గిన వ్యయాలు మెరుగైన కస్టమర్ అనుభవం అందించాలని చూస్తున్నట్లు ఓలా ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన ఉత్పాదకత అందించడానికి ఇది దోహదపడుతుందని తెలుస్తోంది. ఓలా తన షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఉన్న ఫ్రంట్-ఎండ్ సేల్స్, సర్వీస్ అండ్ వేర్‌హౌస్ సిబ్బందిని కూడా తొలగిస్తోంది. బెంగళూరులోని ఈ సంస్థ తాము సరఫరా, డెలివరీ వ్యూహాలను మార్చుకుంటూ వ్యయం తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సోషల్ మీడియా విమర్శలతో మార్కెట్ వాటాను కోల్పోయింది
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు తమ ఆల్-టైమ్ హై స్థాయిల నుంచి 60% క్షీణించాయి. 2024 ఆగస్టులో ఐపీవో ద్వారా బ్లాక్‌బస్టర్ ప్రదర్శన సాధించినప్పటికీ.. ఈవీ కొనుగోలుదారుల నుంచి వరుస ఫిర్యాదులు, సోషల్ మీడియా విమర్శలతో మార్కెట్ వాటాను కోల్పోయింది. దీనికి తోడు ఇటీవల కాలంలో బజాజ్ తన ఈవీ చేతక్ లాంట్ చేయటంతో ఓలాను వెనక్కి నెట్టింది. డిసెంబరులో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో నాయకత్వం సంపాదించడంతో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థాయికి పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ గతంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు. ఇప్పుడు బజాజ్, టీవీఎస్ మోటార్ కంపెనీల నుండి పోటీని ఎదుర్కొంటూ తక్కువ మార్కెట్ షేర్‌కి దిగజారింది. 2024 డిసెంబరు నాటికి దేశంలోని ప్రధాన పది ఈవీ మార్కెట్లలో ఓలా తన నాయకత్వాన్ని కోల్పోయినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జనవరిలో ఓలా 3,200 కొత్త షోరూమ్‌లు ప్రారంభించినా, కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను నివారించడానికి సంస్థ కృషి చేస్తూనే ఉంది.

Related Posts
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు

తల్లిఒడిలో అల్లారుముద్దుగా పెరగాల్సిన ముక్కుపచ్చలారని పసికందులను.. అక్రమ రవాణాకు అలవాటు పడ్డ రాబందులు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నాయి. చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో ఇతర రాష్ట్రాల Read more

Supreme court: భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్విట్టర్ వీడియో వివాదంభావ ప్రకటనా స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య దేశంలో Read more

బిర్యానీ తెచ్చిన తంట 8 లక్షలు ఖర్చు ఎక్కడంటే?
గొంతులో ఇరుక్కున్న ఎముక 8 లక్షల బిల్లుషాక్ లో కుటుంబం

ఆహారం తినడం ఒక ఆనందకరమైన భాగం. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న అపశృతి కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముంబైకి చెందిన ఓ మహిళకు రెస్టారెంట్‌లో Read more

2027 నాటికి భారత్లో భారీగా ఏఐ నిపుణుల కొరత
scientist female wearing vr headset interacting with virtual reality science lab interacting with virtual reality science chemistry technology generative ai

భారతదేశం వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఎదగడానికి అనువైన అవకాశాలు ఉన్నాయి. అధునాతన సాంకేతికత, డేటా విశ్లేషణ, మిషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో దేశీయ సంస్థలు Read more

×