Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే

Odela 2 Release: సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 : రిలీజ్ డేట్ ఇదే సూపర్ హిట్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న ‘ఓదెల 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ‘నాగసాధువు‘ పాత్రలో నటించడంతో మరింత హైప్ పెరిగింది.ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది.దీంతో సినీ ప్రేమికులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా చిత్రబృందం ఓ గుడ్ న్యూస్‌తో ముందుకొచ్చింది.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రక్తంతో తడిసిన తమన్నా లుక్ ఆకట్టుకుంటోంది.”అనుభూతి చెందాల్సిన పాత్ర” అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Advertisements
Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే
Odela 2 Release సమ్మర్ థ్రిల్ కోసం ఓదెల2 రిలీజ్ డేట్ ఇదే

దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022లో విడుదలైన ‘ఓదెల’ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించి సూపర్ హిట్‌ను సాధించింది.ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ రాబోతోంది.ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, వశిష్ట ఎన్.సింహా, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్టశక్తుల నుంచి ఎలా రక్షించాడు అనేదే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది.అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts
స‌లార్ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?
salaar 2

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్’ విడుదలై నేటితో (డిసెంబర్ 22) Read more

దిస్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ
దిస్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ

తమిళ నటుడు శరత్ కుమార్ కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం ది స్మైల్ మేన్ డిసెంబర్ 27, 2023న థియేటర్లలో విడుదలై, తాజాగా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ Read more

కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌లో ఆమిర్‌
Aamir khan

'లాల్‌సింగ్‌ చద్దా' పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ మరింత జాగ్రత్తగా సినిమాల ఎంపికలో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'సితారే జమీన్‌ Read more

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై డాక్యుమెంటరీ..
RRR Jr NTR and Ram Charan

దర్శకధీరుడు రాజమౌళి 'RRR' వెనుక కథను వివరించే డాక్యుమెంటరీ రాబోతోంది పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘RRR’ గురించి కొత్త చర్చ మొదలైంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×