salaar 2

స‌లార్ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ విడుదలై నేటితో (డిసెంబర్ 22) ఏడాది పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ భారీ సెన్సేషన్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి బ్రహ్మరథం అందుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తన విభిన్నత, భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన కథనంతో యాక్షన్ జానర్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ప్రభాస్ మాస్ అప్పీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ అభినయం, మరియు శ్రుతీ హాసన్, జగపతి బాబు వంటి తారాగణం సినిమా విజయానికి పెద్ద ప్లస్ అయ్యాయి. దీంతో ‘సలార్’ కేవలం ఓ సినిమా కాకుండా, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కల్ట్ మూవీగా ముద్ర వేసుకుంది. సినిమా థియేటర్లలో విజయం సాధించినప్పటికీ, సలార్ విజయానికి సాంకేతిక ప్రపంచంలోనూ పెద్ద గుర్తింపు లభించింది.

Advertisements

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలవడం ఒక గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రమే కాదు,ఈ కథను అభిమానుల మదిలో మరింత ఇమిడిపోయేలా చేసింది.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్:పార్ట్ 1 – సీజ్ ఫైర్’రీ-రిలీజ్ అవగా, అది కూడా అభిమానుల నుండి అద్భుత స్పందనను అందుకుంది.ఈ రీ-రిలీజ్ సమయంలో కొత్త రికార్డులు కూడా నమోదు కావడం విశేషం.‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ ఒక ఆసక్తికర ముగింపుతో, ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిగా ఎదురు చూపిస్తోంది. ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’అనే టైటిల్‌తో సీక్వెల్ రానుండటాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. రెండో భాగం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు. రెండో భాగంలో కథ మరింత ఉద్విగ్నంగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Posts
మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
kannappa movie

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "కన్నప్ప" సినిమా గురించి తాజా అప్‌డేట్ అందరినీ ఉత్సాహపరుస్తోంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, చిత్రీకరణ Read more

ఓటీటీలో ‘లైలా’ – విశ్వక్ సేన్‌కు మరో పెద్ద షాక్!
ఓటీటీలో ‘లైలా’ – విశ్వక్ సేన్‌కు మరో పెద్ద షాక్!

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం 'లైలా'. ఈ సినిమా రామ్ నారాయణ్ దర్శకత్వంలో విడుదలైంది, కానీ ఇది సినిమాను థియేటర్‌లో పెద్ద విజయాన్ని Read more

అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..
allu arjun

జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం సభ్యులు ఆయన నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు కారణం,పుష్ప Read more

నవ్వులు పూయిస్తున్న 3 రోజెస్ ఎప్పుడంటే?
నవ్వులు పూయిస్తున్న 3 రోజెస్ ఎప్పుడంటే?

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందించే వినోదం, ఎంటర్టైన్మెంట్ చూస్తూ అనేక మంది ఆహా సబ్‌స్క్రైబర్లుగా మారిపోయారు. ప్రస్తుత సమయం లో, Read more

×