ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్

Manda krishna: ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్

cఏపీలో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో పాటు దీనిపై నియమించిన ఏక సభ్య కమిషన్ రిపోర్టును కూడా ఆమోదించింది. దీనిపై మాల కులాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమిలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు భిన్నంగా విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మౌనంగా ఉంటున్నారు. దీనిపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు.

Advertisements

శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని
ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంలో సీఎం చంద్రబాబుదే కీలకపాత్ర అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన తెలిపారు. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితమని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయంవైపే నిలబడ్డారని ప్రశంసించారు. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

తమకు అండగా మోదీ, అమిత్‌షా, వెంకయ్య, కిషన్‌రెడ్డి
1997లో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని తాను ఎస్సీ వర్గీకరణ కోసం పాదయాత్ర ప్రారంభించానని మందకృష్ణ గుర్తుచేసుకున్నారు. మోదీ, అమిత్‌షా, వెంకయ్య, కిషన్‌రెడ్డి తమకు అండగా నిలిచారన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చారన్నారు. అదే సమయంలో జగన్ ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లం కాదని మందకృష్ణ తెలిపారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకూ జగన్ తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదన్నారు.

Related Posts
ఏపీలో పెరిగిన సముద్ర తీరం
Raised sea coast in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రతీరం పొడవు పెరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 1970లో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర సముద్రతీరం పొడవు 973.7 Read more

రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
RGV bail petition

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ముందస్తు Read more

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

అమరావతి: ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల Read more

Nara Lokesh : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు – లోకేశ్
Nara Lokesh: జగన్ కు హితవు పలికిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. గత 10 నెలల్లో రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×