NIA collecting voice samples of Tahawwur Rana

NIA : తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న ఎన్ఐఏ

NIA : ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ, అతడి వాయిస్ శాంపిల్‌ను సేకరించే చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో 166 మంది ప్రాణాలను బలిగొన్న దాడులకు సంబంధించి ఆ సమయంలో ఇతరులకు తహవూర్ రాణా సూచనలు ఇస్తున్నట్టు అనుమానిస్తున్న కాల్ రికార్డులతో వాయిస్ శాంపిల్‌ను సరిపోల్చి చూడనున్నారు. అయితే, ఈ ప్రక్రియ కోసం వాయిస్ శాంపిల్‌ సేకరించాలంటే నిందితుడి అనుమతి కూడా ఉండాలి. అతను వద్దనుకుంటే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి తర్వాతే అతడి వాయిస్‌ను రికార్డు చేస్తారు. వాయిస్ శాంపిల్‌కు అతడు నిరాకరిస్తే విచారణ దశలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.

Advertisements
 తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్

రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు

కాగా, ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు ముంబై ముట్టడి ప్రారంభం కావడానికి ముందు అతడు దుబాయ్‌లో కలిసిన వ్యక్తి పాత్రను, అతడి ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీగా నమోదైన ముంబైలోని ఆఫీసు లీజును పునరుద్ధరించకపోవడం గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఆఫీసుని 26/11 దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ నగరంలోని కీలకమైన హోటళ్లు, పబ్లిక్ సైట్‌లతో సహా అనుకున్న లక్ష్య ప్రదేశాలపై నిఘా ఉంచడానికి ఒక కవర్‌గా ఉపయోగించినట్లు సమాచారం. అలాగే, ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులు సాజిద్ మజీద్, జకీర్ రెహమాన్ లఖ్వి, అబుద్ల్ రెహమాన్, ఇలియాస్‌ల గురించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలిరోజు విచారణలో తనకేమీ గుర్తులేదని, దాడులు జరిగేందుకు వారం ముందు మాత్రమే వచ్చినట్టు నిందితుడు చెప్పాడని సమాచారం.

Related Posts
Saleshwaram Jathara : సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభం
Saleshwaram Jathara

తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ సలేశ్వరం లింగమయ్య ఆలయంలో వార్షిక జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. ప్రకృతి రమణీయతతో నిండిన ఈ పవిత్ర Read more

చైనా దురాక్రమణపై జపాన్ – ఫిలిప్పీన్స్ రక్షణ సహకారం
చైనా దురాక్రమణపై జపాన్ - ఫిలిప్పీన్స్ రక్షణ సహకారం

జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య రక్షణ సహకారం పెరుగుతోంది. చైనా దురాక్రమణ చర్యలపై ఆందోళనలు పెరగడంతో, ఇరుదేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. భాగస్వామ్య Read more

Bill Gates: ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్
ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న పిల్ల‌ల‌కు త‌న పూర్తి ఆస్తి సంక్ర‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. Read more

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం..!
CISCO sign key agreement with Telangana government.

CISCO: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×