మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

అనేక దేశాల మాదిరే భారత్ కూడా విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు ఈవీ మోడళ్లు తీసుకువచ్చాయి. అంతర్జాతీయ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ కూడా కామెట్ పేరుతో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది చూడడానికి చిన్నదిగా కనిపించినా, ఫీచర్ల పరంగా ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తుంది.
డిఫరెంట్ గా బ్లాక్ కలర్
తాజాగా ఎంజీ ఇండియా తన కామెట్ మోడల్ కు బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. ఇది బ్లాక్ కలర్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎంజీ కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.8 లక్షలు. బ్యాటరీ ధర అదనం. ప్రీ బుకింగ్ సమయంలో ముందుగా రూ.11 వేలు టోకెన్ అమౌంట్ గా చెల్లించాలి. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే… ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో బ్యాటరీని 7.4 కిలోవాట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే 3.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీంట్లోని మోటార్ 110 ఎన్ఎం టార్క్ తో 41 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, కీ లెస్ ఎంట్రీ, ఫుల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ రెడ్ హైలైట్, ఫోల్డబుల్ వ్యూయింగ్ మిర్రర్స్, మాన్యువల్ ఏసీ/హీటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఇది టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు పోటీగా భావిస్తున్నారు.

Related Posts
స్ప్రింగ్ ఫెస్ట్ మళ్లీ వచ్చేసింది!
spring fest

స్ప్రింగ్ ఫెస్ట్ 66వ ఎడిషన్ జనవరి 24 నుండి జనవరి 26, 2025 వరకు జరగనుంది. స్ప్రింగ్ ఫెస్ట్ భారతీయ సాంకేతిక సంస్థ ఖరగ్‌పూర్ వార్షిక సాంస్కృతిక, Read more

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!
దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల Read more

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీకే శివకుమార్
నాపై తప్పుడు ప్రచారం చేసిన డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. మహా శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఇషా Read more

యువతిపై సామూహిక అత్యాచారం
యువతిపై సామూహిక అత్యాచారం

ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా, కొందరి కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళను చూసి అమాంతం రెచ్చిపోతున్నారు. కామంతో కుక్కిలిపోతూ వావివరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. Read more