CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిఎఎం రేవంత్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను కలువనున్నారు. అలాగే.. మహారాష్ట్ర, జార్ఙండ్‌ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ నేతల సమావేశం ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విజయగాథలపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

Advertisements

ఇక, ఇప్పటికే 26 సార్లు ఢిల్లీకి వెళ్లాడని బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్‌ రెడ్డి పై ఫైర్‌ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా… టార్గెట్ కేటీఆర్.. కుట్రకు తెరలేపిందని రేవంత్ సర్కార్ పై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో కేటీఆర్ పై గురి పెడుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేసినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ అరెస్టే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో వరుస ఫిర్యాదులు కూడా కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేశారని….కేటీఆర్ పై మాత్రం ఉందని ఆరోపణలు చేస్తున్నారు.

ఇందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కుల గణన వంటి అంశాలతో పాటు, మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు నెల క్రితమే తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసభ్యులు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సమాచారం.

Related Posts
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు ఇబ్బందులు
Board of Intermediate Nirwakam..Students are in serious trouble

ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు.. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా Read more

అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ వదిలేసినట్లేనా..?
allu arjun

సినీ హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం Read more

జగన్ క్యారెక్టర్ ఇదే – షర్మిల
sharmila fire jagan

తాజాగా వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా, ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా Read more

Revanth Reddy: మరోసారి నేనే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

Revanth Reddy: మరోసారి నేనే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించబోతాననే Read more

×