Senior citizen bus discount:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు అందిస్తోంది. అరవై ఏళ్లు నిండిన మహిళలు పురుషులు అందరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. బస్సులు రైళ్లల్లో టికెట్లపై రాయితీలు లభిస్తాయి. వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడానికి పింఛన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలు అన్నీ కావాలంటే సీనియర్ సిటిజన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
Read also: Billionaire Families : ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలే దేశంలో అత్యంత సంపన్న కుటుంబాలు

కార్డు పొందడానికి కావలసిన పత్రాలు
ఈ ప్రత్యేక కార్డు పొందడానికి వయస్సు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడీ పదో తరగతి సర్టిఫికెట్ ఉపయోగపడతాయి. అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంట్ బిల్లు రేషన్ కార్డు చూపించవచ్చు. దరఖాస్తు చేయుటకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు చురుకైన మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తి అవుతుంది.
Senior citizen bus discount:దరఖాస్తు విధానం మరియు డౌన్‌లోడ్
రాష్ట్రాల ఈ-జిల్లా పోర్టల్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పది రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించాలి. పదిహేను నుండి ముప్పై రోజులలోపు మీ కార్డు సిద్ధం అవుతుంది. ఆన్లైన్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని బస్సు ప్రయాణాలలో రాయితీలు పొందవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: